నేడు రెండో పెళ్లి చేసుకోనున్న నిర్మాత దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు నిజామాబాద్‌లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కానుంది. ఈ మేరకు అధికారికంగా దిల్ రాజు ప్రకటించారు. తన మనవడు (కూతురు బిడ్డ) సమక్షంలో దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వేడుకకు కేవలం 15 మంది మాత్రమే హాజరుకానున్నారు. కాగా లాక్ డౌన్ కావడంతో పెళ్లిళ్లు చేసుకోవాలంటే కేవలం 20 మంది మధ్య మాత్రమే చేసుకోవాలని ఇదివరకే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.
రెండో పెళ్లిపై ప్రకటన..
‘గత కొన్నాళ్లుగా ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు వృత్తిపరమైన ఇబ్బందులు అందరికీ తెలిసిందే. అలాగే నా వ్యక్తిగత జీవితం కూడా అంత గొప్పగా లేదు. త్వరలోనే అంతా సర్దుకుంటుంది. అయితే ఈ తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రపంచమంతా స్తంభించింది. ఈ క్రమంలో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నాను’ అని రెండోపెళ్లిపై దిల్‌రాజు ప్రకటన చేశారు.
పుకార్లే నిజమయ్యాయ్!
ఇదిలా ఉంటే.. దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా వెంటేనే స్పందించే ఆయన ఈ వ్యవహారంపై మాత్రం అస్సలు స్పందించలేదు. అయితే ఆ పుకార్లే ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో మరణించిన అనంతరం తనకంటూ ఓ తోడు నీడ కావాలని ఓ అమ్మాయిని ప్రేమించాడని వార్తలు వినిపించాయి. ఆ మధ్య ఆ అమ్మాయినే పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి ఎయిర్ హోస్టస్ అని కూడా టాక్ నడిచింది. మరి ఆయన రెండో భాగస్వామి ఎవరో ఏంటో తెలియాంటే ఫొటోలు రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments