నేడు రెండో పెళ్లి చేసుకోనున్న నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. నేడు అనగా ఆదివారం రాత్రి ఈ వివాహం జరగనుంది. ఈ వేడుకకు నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదిక కానుంది. ఈ మేరకు అధికారికంగా దిల్ రాజు ప్రకటించారు. తన మనవడు (కూతురు బిడ్డ) సమక్షంలో దిల్ రాజు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ వేడుకకు కేవలం 15 మంది మాత్రమే హాజరుకానున్నారు. కాగా లాక్ డౌన్ కావడంతో పెళ్లిళ్లు చేసుకోవాలంటే కేవలం 20 మంది మధ్య మాత్రమే చేసుకోవాలని ఇదివరకే సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే.

రెండో పెళ్లిపై ప్రకటన..

‘గ‌త కొన్నాళ్లుగా ప్రపంచం ఎదుర్కొంటున్న ప‌రిస్థితులు వృత్తిప‌ర‌మైన ఇబ్బందులు అంద‌రికీ తెలిసిందే. అలాగే నా వ్యక్తిగ‌త జీవితం కూడా అంత గొప్పగా లేద‌ు. త్వర‌లోనే అంతా స‌ర్దుకుంటుంది. అయితే ఈ తాజా మ‌లుపుతో వ్యక్తిగ‌త జీవితాన్ని ఆనంద‌మ‌యం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రపంచమంతా స్తంభించింది. ఈ క్రమంలో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యంగా భావిస్తున్నాను’ అని రెండోపెళ్లిపై దిల్‌రాజు ప్రకటన చేశారు.

పుకార్లే నిజమయ్యాయ్!

ఇదిలా ఉంటే.. దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా వెంటేనే స్పందించే ఆయన ఈ వ్యవహారంపై మాత్రం అస్సలు స్పందించలేదు. అయితే ఆ పుకార్లే ఇప్పుడు అక్షరాలా నిజమయ్యాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యంతో మరణించిన అనంతరం తనకంటూ ఓ తోడు నీడ కావాలని ఓ అమ్మాయిని ప్రేమించాడని వార్తలు వినిపించాయి. ఆ మధ్య ఆ అమ్మాయినే పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయి ఎయిర్ హోస్టస్ అని కూడా టాక్ నడిచింది. మరి ఆయన రెండో భాగస్వామి ఎవరో ఏంటో తెలియాంటే ఫొటోలు రిలీజ్ అయ్యేవరకూ వేచి చూడాల్సిందే.

More News

హైదరాబాదీలు తస్మాత్ జాగ్రత్త.. పోలీసుల ముందస్తు హెచ్చరిక

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఇప్పటికే మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాయి. అయితే ఈ లాక్‌డౌన్‌తో ఎలాంటి కూలినాలీ లేక కార్మికులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అమిత్ షా ఆరోగ్యంపై పుకార్లు రావడం బాధాకరం!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బోన్ క్యాన్సర్‌ బాధపడుతున్నారని రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. అయితే ఈ వార్తల్లో ఏది నిజమో..

పుకార్లు నమ్మొద్దు.. నేను ఆరోగ్యంగానే ఉన్నా : అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. తనకోసం రంజాన్ మాసంలో ముస్లింలు అందరూ ప్రార్థన చేయాలని గత కొన్ని రెండ్రోజులుగా సోషల్ మీడియాలో..

మందుబాబులకు మరో షాక్.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో మద్యపాన నిషేధం దిశగా సీఎం జగన్ సర్కార్ వడివడిగా అడుగులేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ.. ముందుకు కదులుతున్న

ముగ్గురు హీరోయిన్స్‌తో శ‌ర్వానంద్‌!!

జాను సినిమా ప్లాప్ త‌ర్వాత శ‌ర్వానంద్ త‌దుప‌రి సినిమా శ్రీకారం సినిమాను పూర్తి చేసే ప‌నిలోఉండ‌గానే క‌రోనా ఎఫెక్ట్ వ‌చ్చింది. దీంతో శ్రీకారం సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగింది.