రవితేజకు దిల్ రాజు సలహా
- IndiaGlitz, [Saturday,December 05 2015]
మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల టైగర్. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్ మూవీ ఈనెల 10న రిలీజ్ అవుతుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ ఎవడో ఒకడు సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఎవడో ఒకడు మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు...రవితేజను మరి సన్నంగా ఉంటే లుక్ బాగోలేదు. కాస్త బరువు పెంచు అంటూ సలహా ఇచ్చాడట. కిక్ 2 మూవీ ప్లాప్ అవ్వడానికి అనేక కారణాల్లో ఒకటి రవితేజ స్లిమ్ లుక్. మరి దిల్ రాజు సలహా రవితేజ పాటిస్తాడా..? వెంటనే బరువు పెరుగుతాడా..? అనేది చూడాలి.