దిల్‌రాజు అడుగు అక్క‌డ కూడా!!

  • IndiaGlitz, [Saturday,July 11 2020]

తెలుగు చిత్ర నిర్మాత‌ల్లో దిల్‌రాజుకు ఓ ప్ర‌త్యేక‌స్థానం ఉంది. ఆయ‌న అగ్ర హీరోల‌తో పాటు కొత్త కంటెంట్ సినిమాల‌ను కూడా చేయ‌డంలో ఆస‌క్తి చూపిస్తుంటారు. స‌క్సెస్‌ల‌ను కూడా అందుకుంటూ ఉంటారు. ఇప్పుడు దిల్‌రాజు అడుగు డిజిట‌ల్ మీడియాలోకి ప‌డుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం ట్రెండ్ డిజిట‌ల్ మీడియాకు అనుకూలంగా ఉంది. ఎక్కువ మంది డిజిట‌ల్ మీడియా వైపు ఆక‌ర్షితులవుతున్నారు. దీంతో దిల్‌రాజు ప్ర‌త్యేకంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేయాల‌నే ఉద్దేశంతో కాకుండా ప‌రిక్టుల‌ర్‌గా ఓటీటీ కంటెంట్‌ను డెవ‌ల‌ప్ చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. దిల్‌రాజు ద‌గ్గ‌ర చాలా మంది యువ ద‌ర్శ‌కులు ఉన్నారు డిఫ‌రెంట్ కంటెంట్ కూడా ఉంటుంది.

ఈ కంటెంట్‌ను ప్ర‌తి దాన్ని సినిమా చేయ‌డం కంటే డిజిట‌ల్ మాధ్య‌మంలో సినిమా రూపంలోనే, వెబ్ సిరీస్ రూపంలోనో చేస్తే బావుంటుంద‌ని ధిల్‌రాజు భావిస్తున్నాడు. ఇప్ప‌టికే ఎడిట‌ర్ గ్యారీ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్ కొల‌ను క‌థ‌తో విశ్వ‌క్‌సేన్ నిర్మాత‌గా ఓ సినిమా చేసి దాని హ‌క్కులను దిల్‌రాజు తీసుకుంటాడ‌ట‌. ఆ త‌ర్వాత దాన్ని దిల్‌రాజు మార్కెట్ చేసుకుంటాడ‌ని టాక్ విన‌ప‌డుతోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై దిల్‌రాజు అండ్ గ్యాంగ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

More News

‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’కు భారీ ఆదరణ.. దీంతో కొందరేం చేశారంటే..

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ పుస్తకానికి

జీ5 ఓటీటీ నెక్స్ట్ తెలుగు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేస్తున్న సుష్మితా కొణిదెల, విష్ణు ప్రసాద్

హైదరాబాద్, 11 జూలై 2020: స్ఫూర్తివంతమైన 'లూజర్' నుండి 'చదరంగం', 'గాడ్ (గాడ్స్ ఆఫ్ ధర్మపురి)' వరకు... బెస్ట్ కంటెంట్‌ను తెలుగు వీక్షకులకు అందించడంలో జీ5

సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ సచివాలయ అంశం

తెలంగాణ సచివాలయ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

ధారావిపై డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు..

కరోనా వైరస్ ఇండియాలో అప్పుడప్పుడే ప్రారంభమవుతున్న సమయంలో అందరి చూపు ధారావిపైనే పడింది.

స‌మంత బ్యూటీ థెర‌ఫీ

స్టార్ హీరోయిన్ స‌మంత లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.