అప్పుడు వెంకటేష్.. ఇప్పుడు నితిన్

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

ఈ ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన శ‌త‌మానం భ‌వ‌తి ఘ‌న‌విజ‌యం సాధించింది. స‌క్సెస్‌తో పాటు ఎన్నో అవార్డుల‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న స‌తీష్ వేగెశ్న‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని శ్రీ‌నివాస క‌ళ్యాణం పేరుతో తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల పేర్లు వినిపించాయి. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల అవి వ‌ర్క‌వుట్ కాలేదు. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాకి హీరో ఓకే అయ్యాడు. అత‌నే.. యువ క‌థానాయ‌కుడు నితిన్‌.

శ్రీ‌నివాస క‌ళ్యాణంలో నితిన్ హీరోగా న‌టించ‌నున్నాడ‌ని ఈ మ‌ధ్యే వార్త‌లు వినిపించాయి. అయితే.. ఈ రోజు నితిన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించాడు. దిల్ రాజు నిర్మాణంలో 14 ఏళ్ల త‌రువాత శ్రీ‌నివాస క‌ళ్యాణం చేస్తున్నాన‌ని.. స‌తీష్ వేగెశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి మిక్కీ జే.మేయ‌ర్ సంగీత‌మందించ‌నున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. అలాగే మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని పేర్కొన్నాడు నితిన్‌.

30 ఏళ్ల క్రితం వ‌చ్చిన వెంక‌టేష్ శ్రీ‌నివాస క‌ళ్యాణం మంచి విజ‌యం సాధించింది. వెంకీ టైటిల్‌తో వ‌స్తున్న ఈ నితిన్ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

More News

వివాదంపై బండ్ల గణేష్ వివరణ

నిర్మాత బండ్ల గణేష్, రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ మధ్య టెంపర వివాదం రాజుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన టెంపర్ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు.

'ఇంద్రసేన' సెన్సార్ పూర్తి

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటించిన చిత్రం `ఇంద్రసేన`.

చరణ్.. ఆ ఇద్దరితో మూడోసారి?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం 1985తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వేసవి కానుకగా మార్చి 29న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అజ్ఞాతవాసిలోనూ ఆమె ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అత్తారింటికి దారేది. కుటుంబ కథా చిత్రంగా నిరూపొందినఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.

చరణ్ మూడోసారి ఒప్పుకుంటాడా?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తనతో మూడోసారి నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్కు అవకాశం ఇస్తాడా?..ఏమో చెప్పలేం అంటున్నారు టాలీవుడ్ జనాలు. వివరాల్లోకెళ్తే..రామ్చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.