మహేష్ 25 విషయంలో దిల్ రాజు సెంటిమెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏప్రిల్ నెలకి, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజుకి విడదీయరాని బంధం ఉంది. ఎందుకంటే.. దిల్ రాజు నిర్మించిన తొలి చిత్రం ‘దిల్’ (2003) ఇదే నెలలో విడుదలై మంచి విజయం సాధించింది. నితిన్ హీరోగా వి.వి.వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాని .. దిల్ రాజుకి సక్సెస్ పరంగా బోణీ అందించిన మూవీగా చెప్పుకోవచ్చు.
అలాగే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోహీరోయిన్లుగా దశరథ్ డైరెక్షన్‌లో రాజు నిర్మించిన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ (2011) కూడా ఇదే ఏప్రిల్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సరిగ్గా.. ‘దిల్’ విడుదలైన అదే ఏప్రిల్‌లో అంటే.. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ విడుదల కావడం విశేషం. కట్ చేస్తే.. మళ్ళీ ఎనిమిదేళ్ళ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త చిత్రం కూడా ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.
దిల్ తరువాత మిస్టర్ పర్‌ఫెక్ట్‌కి 8 ఏళ్ళ గ్యాప్ వర్కవుట్ అయినట్టే.. మిస్టర్ పర్‌ఫెక్ట్ తరువాత 8 ఏళ్ళ గ్యాప్ మహేష్ సినిమాకి కూడా వర్కవుట్ అవుద్దేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments