థాంక్యూ అంటున్న దిల్‌రాజు...

  • IndiaGlitz, [Tuesday,August 14 2018]

ప‌దిహేనేళ్ల‌లో 30 సినిమాలు చేసిన నిర్మాత దిల్‌రాజుకు స‌క్సెస్ శాతం ఎక్కువే. అయితే ఈ ఏడాది ఆయ‌న ఎంతో న‌మ్మ‌కంతో చేసిన రెండు సినిమాలు అయ‌న‌కు నిరాశ‌ను క‌లిగించాయి. అందులో ల‌వ‌ర్ ఒక‌టి కాగా.. మ‌రో చిత్రం శ్రీనివాస‌క‌ళ్యాణం. ముఖ్యంగా శ్రీనివాస క‌ళ్యాణంపై దిల్‌రాజు భారీ అంచ‌నాల‌నే పెట్టుకున్నాడు. అయితే తొలి రోజునే సినిమా డివైడ్ టాక్ తెచ్చేసుకుంది.

రీసెంట్‌గా జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ఈ విష‌యాన్ని దిల్‌రాజు బ‌హిరంగంగా ఒప్పుకున్నారు కూడా. అయితే శ్రీనివాస క‌ళ్యాణం స‌క్సెస్ కాక‌పోవ‌డానికి కార‌ణం యూత్ కోరుకునే ఎంట‌ర్‌టైనింగ్ అంశాలు త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని దిల్‌రాజు భావించారు. అందుక‌ని స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలోనే మ‌రో సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఈ విష‌యాన్ని దిల్‌రాజు బ‌హిరంగంగా ప్ర‌క‌టించాడు.

ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ పెట్టాడు..'ఎలా చెప్పాలో ట్యాగ్ లైన్‌' ను కూడా అనౌన్స్ చేసేశాడు. యూత్ కోరుకునే ఎంట‌ర్‌టైనింగ్ అంశాల‌న్నీ ఈ థాంక్యూ సినిమాలో ఉంటాయ‌ని.. శ‌త‌మానం భ‌వ‌తితో స‌క్సెస్ కొట్టిన స‌తీశ్‌..శ్రీనివాస క‌ళ్యాణంతో ఆశించిన విజయాన్ని ద‌క్కించుకోలేక‌పోయారు. ఇప్పుడు హ్యాట్రిక్ ప్ర‌య‌త్నంలో హిట్ కొడ‌తామ‌నే కాన్ఫిడెన్స్ తో దిల్‌రాజు ఉన్నారు.