ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారో చూపిస్తున్నాం అంతేకానీ...అమ్మాయిలను తప్పుగా చూపిండం లేదు - దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య, బొమ్మరిల్లు, పరుగు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మిస్టర్ పర్ ఫెక్ట్...ఇలా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా చిత్రాలను నిర్మిస్తూ అభిరుచిగి గల నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న నిర్మాత దిల్ రాజు. ఓ వైపు నిర్మాతగా, మరో వైపు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ సాధిస్తున్న దిల్ రాజు తాజాగా రోజులు మారాయి చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు. మారుతి కథ - స్ర్కీన్ ప్లే తో నూతన దర్శకుడు మురళీకృష్ణ రూపొందిన రోజులు మారాయి చిత్రాన్ని జులై 1న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రోజులు మారాయి చిత్ర సమర్పకుడు దిల్ రాజు తో ఇంటర్ వ్యూ మీకోసం...
రోజులు మారాయి చిత్రాన్ని మారుతితో కలిసి నిర్మించడానికి కారణం..?
ఒక రోజు మారుతి వచ్చి ఈ కథ గురించి ఫస్ట్ ఐడియా చెప్పాడు.ఆతర్వాత ఫుల్ స్ర్కిప్ట్ చెప్పాడు. నాలుగు క్యారెక్టర్స్ మధ్య జరిగే కథ ఇది. చిన్న బడ్జెట్ లో రూపొందే ఈ కథ నాకు బాగా నచ్చింది. ప్రజెంట్ యూత్ ఎలా ఉంటున్నారో ఈ సినిమాలో చూపిస్తున్నాం. మారుతి సినిమా స్టైల్ నాకు నచ్చుతుంది. చాలా కొత్తగా తీసారు. అందుకనే కథ నచ్చడంతో ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాను.
ఈ సినిమాలో ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉంటున్నారో చూపిస్తున్నారా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది చూపిస్తున్నాం. అలాగని అమ్మాయిలను తప్పుగా చూపిండం లేదు. నా బ్యానర్ లో వచ్చే చిత్రాలను అమ్మాయిలు కూడా ఆదరిస్తారని నాకు తెలుసు. అందుచేత ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూపిస్తున్నాం అంతే.
వేరే డైరెక్టర్, వేరే నిర్మాతతో కలిసి సినిమాలు చేయడానికి కారణం ఏమిటి..?
వేరే వాళ్లతో కలిసి సినిమాలు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నా దగ్గర మేన్ పవర్ పెరిగింది. శిరీష్, హర్షిత్ ప్రొడక్షన్ చూసుకుంటున్నారు. రెండు చిన్నసినిమాలు చేయాలని ఉన్నా కథలు విని, స్ర్కిప్ట్ ఫైనల్ చేసి అంతా దగ్గర ఉండి చూసుకునేంత టైమ్ లేదు. అందుచేత ఎవరైనా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తే వాళ్లని ప్రొత్సహిస్తే మరెన్నిచిన్న సినిమాలు వస్తాయనే ఉద్దేశ్యంతో ఇలా వేరే వాళ్లతో కలిసి సినిమాలు చేస్తున్నాను.
అప్పుడప్పుడు మీ జడ్జెమెంట్ రాంగ్ అవుతుంది ఎందుకని..?
ఆడియన్స్ ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు...ఆడియన్స్ టేస్ట్ ఎలా మారుతుంది అనేది అబ్జర్వ్ చేస్తుంటాను. అందుచేత నేను అనుకున్నది 90% కరెక్ట్ అవుతుంది అప్పుడప్పుడు 10% నా జడ్జెమెంట్ తప్పు అయినప్పుడు కృష్ణాష్టమి లాంటి సినిమాలు వస్తుంటాయి. కృష్ణాష్టమి ఫ్లాప్ అవ్వడానికి కారణం నేనే.
రోజులు మారాయి చూసుంటారు కదా..ఏమనిపించింది..?
రోజులు మారాయి ఫస్టాఫ్ గంటా పదినిమిషాలు. ఎలాంటి కరెక్షన్స్ చేయాలనిపించలేదు. సెకండాఫ్ గంటా పదినిమిషాలు చూపించారు. దీనిని 55 నిమిషాలు ఉండేలా కరెక్షన్స్ చేయించాను.అంతకు మించి ఎలాంటి కరెక్షన్స్ చేయలేదు.
నానితో చేయనున్న మూవీ ఎప్పుడు ప్రారంభం..?
నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మూవీ ఆగష్టులో ప్రారంభిస్తున్నాం. డిసెంబర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
పవన్ కళ్యాణ్ తో మూవీ ఎప్పుడు..?
కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అది జరగచ్చు జరగకపోవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.
త్రివిక్రమ్ తో సినిమా ఎనౌన్స్ చేసారు కదా...ఈ మూవీలో హీరో ఎవరు..?
త్రివిక్రమ్ కథ బట్టి ఆయనే హీరో ఎవరనేది సెలెక్ట్ చేస్తారు. ఆయన కథను బట్టి ఏ హీరోతో చేద్దాం అంటే ఆ హీరోతో చేస్తాను.
శతమానం భవతి సంక్రాంతికి రిలీజ్ చేస్తామన్నారు. సంక్రాంతికి పోటీ పెరుగుతుంది.మరి.. శతమానం భవతి సంక్రాంతి రిలీజ్ ఉంటుందా..?
శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో శతమానం భవతి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతి సినిమా అందుచేత ఖచ్చితంగా సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments