close
Choose your channels

'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' బన్నికి మా సంస్థంలో హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది - దిల్ రాజు

Monday, June 5, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని ఈద్ సంద‌ర్భంగా జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన, వేణు శ్రీరాం, సాయికిరణ్‌ అడివి, బొమ్మరిల్లు భాస్కర్‌, దశరథ్‌, వాసువర్మ, అనిల్‌ రావిపూడి, రాధామోహన్‌, శ్రీవాస్‌, సతీష్‌ వేగేశ్న, శేఖర్‌ కమ్ముల, శ్రీకాంత్‌ అడ్డాల, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, ఎస్‌.హరీష్‌ శంకర్‌, వి.వి.వినాయక్‌, దిల్‌రాజు, శిరీష్‌ తదితరులు పాల్గొని థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

14 ఏళ్ళ జ‌ర్నీని మ‌ర‌చిపోలేదు..గ్రేట్ మూమెంట్‌
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -
''దిల్‌, ఆర్య, బొమ్మరిల్లు, పరుగు, కొత్తబంగారు లోకం ఇలా ప్రతి సినిమా మాకు గ్రేట్‌ మూమెంట్‌. ఈ సినిమా. మా సంస్థలో న్నికి తప్పకుండా హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో ఏ ఒక్కరికే సంబంధం ఉండదు. హరీష్‌తో మూడు సినిమాలు అయిపోయాయా అనిపిస్తుంది. త్వరలోనే మరో సినిమాను కూడా అనౌన్స్‌ చేస్తాం. మా బ్యానర్‌లో 50 సినిమాలు అయితే చేయగలను కానీ వంద సినిమాలు అవుతాయో, కావో తెలియదు. అలాగే నా లైఫ్‌లో నేను డైరెక్షన్‌ చేయను. ఎందుకంటే నేను ఒక స్క్రిప్ట్‌ను సెలక్ట్‌ చేసి బావుందో, బాలేదో చెప్పేస్తాను. కానీ దర్శకుడనేవాడు ఓ సినిమాను చేయడానికి రాత్రి పగలు పడే కష్టం చూస్తే నాకు భయం. నేను అంత కష్టం పడలేను. మా బ్యానర్ 14 ఏళ్ళ జ‌ర్నీని మ‌ర‌చిపోలేను. ఈ సంస్థలో పనిచేసిన హీరోలకు, టెక్నిషియన్స్‌కు థాంక్స్‌'' అన్నారు.

రామానాయుడు త‌ర్వాత క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే నిర్మాత దిల్‌రాజు
సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ -
``ఈ బ్యాన‌ర్ స్టార్ట్ చేసి 14 సంవ‌త్స‌రాలు అయిపోయాయి. నాకు దిల్‌ సినిమా నిన్న మొన్న చేసినట్లు ఉంది. కానీ పద్నాలుగేళ్లు అయిపోయాయని తెలిసి ఆనందంగా అనిపించింది. ఈ వేడుక చూస్తుంటే ఆత్మీయులందరూ కలిసి సరదాగా కలుసుకున్నట్లు ఉంది. హరీష్‌ ఎనర్జి నాకు చాలా ఇష్టం. ధైర్యంగా, వేగంగా ఉంటాడు. బన్ని కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉంటాడు. ఇద్దరూ కలిసి చేసిన సినిమా ఇది. ఖైదీ నంబర్‌ 150 సమయంలో హరీష్‌ రెండు, మూడు సీన్స్‌ నాకు చెప్పగానే అదిరిపోయాయని చెప్పాను. కథ చాలా బావుంది. సినిమా తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుందని అక్కడే ఉన్న రాజుగారికి చెప్పాను. ట్రైలర్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది...చిరిగిపోయింది. దేవిశ్రీ మ్యూజిక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామానాయుడుగారు స్టార్ట్స్‌ను నమ్మి కాకుండా కథను నమ్మి సినిమా చేసేవారు. ఆ పాలసీతో ఇప్పుడు దిల్‌రాజుగారు సినిమాలు చేస్తున్నారు. ఈ సంస్థ ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది'' అన్నారు.

బ‌న్ని నా నుండి బెస్ట్ అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నాడు
చి్త్ర ద‌ర్శ‌కుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ -
''సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు వినాయకుడిని పూజిస్తాం. అలాగే ఇండస్ట్రీలో నాకు ఏదైనా సమస్య వస్తే నేను వినాయక్‌గారి దగ్గరకు వెళతాను. నేను ఆయనకు ఏకలవ్య శిష్యుణ్ణి. బన్ని, రాజుగారికి ముందు 20 నిమిషాల పాయింట్‌ చెప్పగానే, రాజుగారు వెంటనే హరీష్‌ ఇది కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ సినిమా స్క్రిప్ట్‌ రెడీ చెయ్‌ అన్నారు. రాజుగారు డైరెక్టర్‌ కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. సాధారణంగా దర్శకులనేవారు హీరోల దగ్గర నుండి వారికేం కావాలో అది రాబట్టుకున్నామని అంటారు. కానీ ఫస్ట్‌ టైం బన్ని తనకేం కావాలో దర్శకుడైనా నా దగ్గర నుండి రాబట్టుకున్నారు. నేనే కాదు, అందరి నుండి బెస్ట్‌ రాబట్టుకున్నాడు. తనకు థాంక్స్‌'' అన్నారు.

ఏ డైరెక్ట‌ర్‌కైనా దిల్‌రాజుగారు గైడ్ బుక్‌లాంటివారు
బోయపాటి శ్రీను మాట్లాడుతూ -
''ఈ వేదికపై దర్శకుడిగా నిలబడటానికి కారణం దిల్‌రాజు. నా మొదటి చిత్రం భద్రని నేను బన్నితో చేయాల్సింది. కానీ కొన్ని కారణాలతో తను సినిమా చేయలేకపోయినా, తనే దిల్‌రాజుగారికి నన్ను పరిచయం చేశారు. అలాంటి హీరో, నిర్మాత ఉండబట్టే నేను దర్శకుడిని కాగలిగాను. ఒక మంచిని మరచిపోకూడదు. ఏ డైరెక్టర్‌కు అయినా దిల్‌రాజుగారు గైడ్‌బుక్‌లాంటివారు. మంచి కన్విన్షన్‌ ఉండేవారు. అయన వంద సినిమాలు చేస్తారో, ఎన్ని చేస్తారో కానీ ఆయన చేసే ప్రతి సినిమా బావుండాలి. దిల్‌రాజుగారిలాంటి నిర్మాతలు అరుదుగా ఉంటారు. ఈ సినిమా విషయానికి వస్తే, ట్రైలర్‌ చాలా బావుంది. మంచి సినిమాలు ఇంకా దిల్‌రాజు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సినిమాల‌తో గౌర‌వం సంపాదించుకున్న నిర్మాత దిల్‌రాజు
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ -
''ఈ బ్యానర్ నాకు మాతృసంస్థ. నాకే కాదు, ఎంతో మంది దర్శకులకు జన్మనిచ్చిన సంస్థ. వీరంతా నా కుటుంబ సభ్యులే. సినిమా వల్ల డబ్బులు, పేరు సంపాదించవచ్చు కానీ గౌరవాన్ని సంపాదించేది కొందరే. అందులో దిల్‌రాజుగారు ఒకరు. హరీష్‌ నాకు మంచి మిత్రుడు. ఇద్దరి కెరీర్‌లు ఒకేలా తడబడుతూనే స్టార్ట్‌ అయ్యాయి. తన కన్విక్షన్‌ నాకు బాగా నచ్చింది. ఏదైనా ఓపెన్‌గానే మాట్లాడుతాడు. తను నమ్మే దాని కోసం ఎంతైనా నిలబడతాడు. వాడికొంత తిక్కుంది. దానికొక లెక్కుంది. సరైనోడు తర్వాత బన్ని చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ - ''ఈ బ్యానర్‌లో దర్శకుడిగా నా పేరు చూడగానే నాకు వైబ్రేషన్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యానర్‌లో రూపొందిన 25వ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఈ బ్యానర్‌లో సినిమాలను డైరెక్ట్‌ చేసిన దర్శకులంతా రావడం. వారిలో నేను ఓ భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. టైటిల్‌ వినగానే సౌండింగ్‌ మాస్‌ రేంజ్‌లో కనెక్ట్‌ అవుతుందని భావించాను. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

సాయికిరణ్‌ అడివి మాట్లాడుతూ - ''ట్రైలర్‌ చూస్తుంటే రియల్‌ లైఫ్‌లో హరీష్‌ శంకర్‌గారు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో అంతే ఎనర్జిటిక్‌గా ఉంది. దిల్‌రాజు సినిమాలు చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తారు. ఆయన బ్యానర్‌లో నేను ఒక సినిమా చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.

వాసువర్మ మాట్లాడుతూ - ''డిజె దువ్వాడ జగన్నాథమ్‌ ట్రైలర్‌ అదిరిపోయింది. నేను హరీష్‌ స్పీచ్‌కు పెద్ద ఫ్యాన్‌ని. నేను దిల్‌రాజుగారిని ఒకప్పుడు దర్శకత్వం చేయమని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఆయన్ను దర్శకత్వం చేయవద్దని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన దర్శకుడైతే ఇండస్ట్రీలో ఓ దర్శకుడు పెరుగుతాడంతే, అదే ఆయన నిర్మాత అయితే ఆయన వంద మంది దర్శకులను పరిచయం చేస్తారు. ఆయన వంద సినిమాలు చేయాలని, అందులో కూడా నేను ఒక భాగం కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

శ్రీవాస్‌ మాట్లాడుతూ - ''బన్ని, హరీష్‌ శంకర్‌ల ఎనర్జి ఎలా ఉంటుందో దానికి రెట్టింపు ఎనర్జితో ట్రైలర్‌ కనపడుతుంది. ట్రైలర్‌ చూడగానే పాజిటివ్‌ ఫీల్‌ వచ్చింది. దిల్‌రాజుగారి బ్యానర్‌లో రిచ్‌ మేకింగ్‌ వాల్యూస్‌ కనపడుతున్నాయి. దిల్‌రాజుగారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

బొమ్మరిల్లు భాస్కర్‌ మాట్లాడుతూ - ''ట్రైలర్‌ చాలా బాగా నచ్చింది. బన్ని ఎనర్జి గురించి నేను స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. దిల్‌రాజు అంటే నాకు తెలిసి, మంచి కథలను సెలక్ట్‌ చేసుకుని, వాటిని సినిమా తెరకెక్కించే వరకు దర్శకుడిగా ఎంతో సపోర్ట్‌ చేస్తారు. బెటర్‌ మెంట్‌ కోసం ఎంతైనా సహకారం అందిస్తారు. అందువల్లే ఆయన మంచి సినిమాలను చేయగలిగారు. మా అందరికీ చాలా ముఖ్యమైన బ్యానర్‌ ఇది. ఈ బ్యానర్‌లో వంద సినిమాలు రావాలి. వంద కొత్త దర్శకులు ఈ బ్యానర్‌లో పరిచయం కావాలి'' అన్నారు.

శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ - ''25 సినిమాలు చేయడం అంటే అంత సులువు కాదు. ముందు ముందు కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలి. డిజె టీంకు ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ - ''ఇంత మంది దర్శకులతో పనిచేసిన రాజుగారు, శిరీష్‌గారితో అనుబంధం నాకు మెమొరబుల్‌. హరీష్‌ అన్న, బన్నిగారి ఎనర్జి ట్రైలర్‌ కనపడుతుంది. డిజెతో ఈ ఏడాది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కు హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుంది. అలాగే హరీష్‌ అన్న కెరీర్‌లో పెద్ద బ్లాక్‌బస్టర్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

సతీష్‌ వేగేశ్న మాట్లాడుతూ - ''నేను దర్శకుడిగా మారడానికి కారణం హరీష్‌గారే. ఒక సినిమాతో నిర్మాత వంద కుటుంబాలను బ్రతికిస్తాడంటారు. కానీ 25 సినిమాల నిర్మాత అన్నప్పుడు ఎన్ని వందల కుటుంబాలు బ్రతికి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. దిల్‌రాజుగారు మరో వంద మంది దర్శకులను పరిచయం చేసిన తర్వాత దర్శకత్వం చేయాలని కోరుకుంటున్నాను. ట్రైలర్‌ బావుంది. ఈ సినిమాతో ఈ బ్యానర్‌కు హ్యాట్రిక్‌ హిట్‌ కావాలని కోరుతున్నాను'' అన్నారు.

శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ - ''ట్రైలర్‌ చూస్తుంది హై ఎనర్జితో కనపడుతుంది. దిల్‌రాజుగారు వంద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ చిత్రానికి ఫైట్స్‌:రామ్‌-లక్ష్మణ్‌, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్‌: ఛోటా కె.ప్ర‌సాద్, ఆర్ట్‌: రవీందర్‌, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్‌, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌ శంకర్‌.ఎస్‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment