తెలుగు »
Interviews »
ఇక్కడ బ్లాక్ బష్టర్ అయిన సరైనోడు ఓవర్ సీస్ లో అలాంటి రిజల్ట్ రావడానికి కారణం అదే.. - దిల్ రాజు
ఇక్కడ బ్లాక్ బష్టర్ అయిన సరైనోడు ఓవర్ సీస్ లో అలాంటి రిజల్ట్ రావడానికి కారణం అదే.. - దిల్ రాజు
Friday, May 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, పరుగు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు...ఇలా అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తూ...వరుస విజయాలు సాధిస్తూ...తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న ఉత్తమాభిరుచి గల నిర్మాత దిల్ రాజు. అటు ఆడియోన్స్ లో - ఇటు ఇండస్ట్రీలో దిల్ రాజు సినిమా అంటే...ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉండే ఓ మంచి సినిమా అనే ఒక ముద్ర ఏర్పడింది. సినిమా స్టైల్ లో చెప్పాలంటే...దిల్ రాజు అంటే ఇట్స్ నాట్ ఎ నేమ్...ఇట్స్ ఎ బ్రాండ్. అయితే...ప్రస్తుతం దిల్ రాజుకి కాలం కలిసి రావడం లేదో...లేక టైమ్ బాగోలేదో...లేక ఏ కథ సక్సెస్ అవుతుందో... సరిగా జడ్జ్ చేయలేక పోతున్నారో కారణం తెలియదు కానీ...దిల్ రాజు బ్యానర్ నుంచి (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) వరుసగా ఫ్లాప్ మూవీస్ వస్తున్నాయి. వరుస విజయాలు చూసిన దిల్ రాజు ఇప్పుడు వరుసగా అపజయాలు చూస్తున్నారు. ఈ సందర్భంగా సక్సెస్ - ఫెయిల్యూర్స్ గురించి...తాజా చిత్రం సుప్రీమ్ సక్సెస్ గురించి...దిల్ రాజు మనసులో మాటలు ప్రత్యేకంగా మీకోసం...
సుప్రీమ్ సినిమాకి మీరు ఊహించిన రిజల్ట్ వచ్చిందా..?
సుప్రీమ్ కథ విన్నప్పుడు రెగ్యులర్ ఎంటర్ టైనర్ లా కాకుండా...సీన్స్ లోనే కామెడీ ఉండేలా అనిల్ స్ర్కిప్ట్ రెడీ చేసాడు. అది నాకు బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే...ఈ తరహా కామెడీ జంధ్యాల గారి సినిమాల్లో చూసేవాళ్లం. ఈ కామెడీ ఆడియోన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది అని నమ్మాను. నేను అనుకున్నట్టే ఆడియోన్స్ కి బాగా రీచ్ అయ్యింది. నా నమ్మకం నిజం అయ్యింది. అయితే ఇక్కడో విషయం చెప్పాలి...నాకు కరెక్ట్ రిపోర్ట్ చెప్పేవాళ్లు ఓ ఐదుగురు ఉన్నారు. నేను తీసిన ఏ సినిమా అయినా సరే రిలీజ్ రోజు వాళ్లు నాకు రిపోర్ట్ చెబుతారు. సుప్రీమ్ రిలీజ్ రోజు ఈ ఐదుగురులో ఇద్దరు ఫోన్ చేసారు కానీ..మిగిలిన ముగ్గురు ఫోన్ చేయలేదు. అలాగే కొంత మంది సుప్రీమ్ బాగుంది అన్నారు. మరి కొంత మంది ఫరవాలేదు అన్నారు కానీ కరెక్ట్ గా హిట్ అని ఎందుకు చెప్పడం లేదని చిన్న డౌట్. ఫస్ట్ డే ఓవరాల్ గా మిక్స్ డ్ టాక్ వచ్చింది.
శ్రీరాములు థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన తర్వాత ఆడియోన్స్ ఎంజాయ్ చేయడం చూసిన తర్వాత సుప్రీమ్ ఖచ్చితంగా హిట్ అనిపించింది. డైరెక్టర్ అనిల్, హీరో తేజుకి మూడు రోజుల వరకు ఏమీ మాట్లాడకండి. మూడు రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అని చెప్పాను. ఏ సినిమా అయినా సోమవారం కూడా ఫుల్ అయ్యింది అంటే ఆ సినిమా హిట్టే అని నా నమ్మకం. మా సినిమా సోమవారం కూడా ఫుల్ అయ్యింది. సో..సుప్రీమ్ నిలబడింది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అని నమ్మకం ఏర్పడింది కాబట్టే సుప్రీమ్ సక్సెస్ ని పంచుకోవడానికి మీడియా ముందుకు వచ్చాను.
సినిమా రిజల్ట్ తెలియాలంటే....ఫస్ట్ డే మార్నింగ్ షో కాకుండా సోమవారం మార్నింగ్ షో వరకు ఆగాలంటారా..?
ఫస్ట్ డే మార్నింగ్ షో ఫ్యాన్స్ చూస్తారు. జనరల్ ఆడియోన్స్ ఫస్డ్ డే మార్నింగ్ షోకి రారు. ఈ సినిమా గురించి ఫ్యాన్స్ అయితే హీరోయిజం తక్కువ అయ్యింది అన్నారు. కొంత మంది అయితే అసలు కథ ఏముంది అన్నారు. ఇలా రకరకాల టాక్స్ రావడం వలన మాకు అసలు రిజల్ట్ తెలియడానికి సోమవారం వరకు ఆగాల్సి వచ్చింది. అయితే సినిమా రిజల్ట్ కోసం సోమవారం మార్నింగ్ షో వరకు ఆగాలా అంటే...అన్ని సినిమాలకు అలా కాదు. బాహుబలి లాంటి సినిమా అయితే...ఫస్ట్ డే మార్నింగ్ షోకి రిజల్ట్ తెలిసిపోతుంది.
సుప్రీమ్ లో హీరోయిజం తక్కువ అయ్యింది అని అభిమానులు అన్నారు అని చెప్పారు కదా...హీరో తేజు ఏమైనా అన్నాడా..?
మా హీరో తేజు బంగారం. ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తేజు అనే కాదు...ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల హీరోలు ఎవరు కూడా నాకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.
దిల్ రాజు సినిమా అంటేనే మంచి కథ ఉంటుంది. అయితే...సుప్రీమ్ లో కథ ఉందంటారా..?
సుప్రీమ్ లో కథ ఉందా...? అనే సందేహం ఎందుకు..? సుప్రీమ్ లో అసలు కథే లేదు. అయినా సుప్రీమ్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇది నిజం. కథ లేకపోయినా ఎందుకు సుప్రీమ్ తీసానంటే...ఇందులో ఎంటర్ టైన్మెంట్ ఉంది. వర్కవుట్ అవుతుంది అనుకున్నాను. నేను అనుకున్నట్టే వర్కవుట్ అయ్యింది.
ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం...ఇలా మంచి కథలతో చిత్రాలు తీసిన మీరు ఇప్పుడు అసలు కథే లేకుండా సినిమా తీస్తున్నారు...మీలో ఈ మార్పు ఎలా వచ్చింది..?
మీరు అన్నట్టు నిజంగానే ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం...ఇలా మంచి కథలతో సినిమాలు చేసాను. అయితే ఆతర్వాత ఏమైంది అంటే...
తెలియకుండానే మా సంస్థలో సినిమాల నిర్మాణం పెరిగింది. స్టార్స్ తో సినిమాలు తీయడం జరిగింది. బడ్జెట్...బిజినెస్ పెరిగింది. ఎప్పుడైతే బడ్జెట్..మార్కెట్..బిజినెస్ గురించి ఆలోచించడం మొదలైందో అప్పుడు కమర్షియల్ సినిమాలు చేయడం ఎక్కువైంది అనుకోవచ్చు. కమర్షియల్ మూవీస్ కూడా మంచి కథలతోనే తీసి సక్సెస్ సాధించాను. రామయ్య వస్తావమ్యా, కృష్ణాష్టమి తప్పా...నేను తీసిని అన్ని సినిమాలు హిట్టే.
కృష్ణాష్టమి సక్సెస్ అవుతుంది అని కాన్పిడెంట్ గా చెప్పారు..కానీ సక్సెస్ కాలేదు కారణం ఏమిటి..?
కృష్ణాష్టమి సక్సెస్ అవుతుంది అని కాన్పిడెంట్ గా కాదు ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పాను. కథ ను నేనే ఓకే చేసి చేసిన సినిమా అది. అందుచేత కృష్ణాష్టమి ఫెయిల్యూర్ కి కారణం నేనే. రెండు సంవత్సరాల క్రితం ఓకే చేసిన కథ కావడం...సునీల్ ని కొత్తగా చూపించాలనుకోవడం మేము చేసిన తప్పు. కృష్ణాష్టమి మాకు ఒక పాఠం లాంటిది.
ఓవర్ సీస్ లో సుప్రీమ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది..?
ఓవర్ సీస్ లో సాఫ్ట్ మూవీస్..ఎంటర్ టైన్మెంట్ మూవీస్ లైక్ చేస్తారు. సుప్రీమ్ లో 100% ఎంటర్ టైన్మెంట్ ఉంది కాబట్టే ఓవర్ సీస్ ఆడియోన్స్ కి నచ్చింది. ఓవర్ సీస్ లో సినిమా బిజినెస్ 90% రివ్యూస్ పై ఆధారపడి ఉంటుంది. దీనికి నిదర్శనమే...సరైనోడు సినిమా. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే...సరైనోడు ఇక్కడ బ్లాక్ బష్టర్..మరి ఓవర్ సీస్ లో...రిజల్ట్ ఏమిటి..? కారణం రివ్యూస్...!
ఫస్ట్ టైమ్ సమర్పకుడిగా టైటిల్స్ లో మీ పేరు పడింది..? ఏమిటి కారణం..?
పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో హర్షిత్ ని నిర్మాతగా పరిచయం చేసాం. సుప్రీమ్ తో శిరీష్ ని నిర్మాతగా పరిచయం చేసాం.ఒకప్పుడు నేను ఒక్కడినే సినిమాల పై కాన్ సన్ ట్రేషన్ చేసేవాడిని. ఈ స్ధాయికి వచ్చాకా స్టోరీస్ ఎక్కువ వినాల్సి వస్తుంది. వర్క్ పెరిగింది. అందుచేత శిరీష్ ని నిర్మాతగా పరిచయం చేసాం. ఇక నుంచి సంవత్సరానికి మూడు లేక నాలుగు సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ తో పాటు మరో బ్యానర్ కూడా ప్రారంభించనున్నాం. దిల్ రాజు సినిమా అంటే ఫ్యామిలీ అంతా కలసి చూసేలా ఉంటుందనే ఒక బ్రాండ్ ఉంది కదా...దీనికి తగ్గట్టు ఒక బ్యానర్ లో సినిమాలు చేయాలని ప్లాన్. మరో బ్యానర్ లో కమర్షియల్ సినిమాలు చేయాలని ప్లాన్.
మారుతితో కలసి సినిమా చేస్తున్నట్టున్నారు..?
రోజులు మారాయి అనే సినిమాని మారుతితో కలిసి నిర్మిస్తున్నాను. అలాగే నిర్మాత బెక్కం వేణుగోపాల్ తో కలిసి మరో సినిమా నిర్మిస్తున్నాను. ఇలా వేరే నిర్మాతతో కలిసి చేసిన చిత్రాలను ఎస్.వి.సి సినిమాస్ రిలీజ్ ద్వారా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
జనగణమన టైటిల్ మీరు రిజిష్టర్ చేయించారు కదా..?
మా బ్యానర్ లో జనగణమన టైటిల్ తో సినిమా చేద్దాం అని రిజిష్టర్ చేయించాను. అయితే..ఒక రోజు పూరి జగన్నాథ్ ఫోన్ చేసి...నాకు ఓ టైటిల్ కావాలి. అది మీ బ్యానర్ లో రిజిష్టర్ చేసారట అని అన్నారు. ఏ టైటిల్ అని అడిగితే...జనగణమన అని చెప్పారు. ఈ టైటిల్ నాకు కావాలి అని పూరి అడిగారు...ఒక్క నిమిషం ఆలోచించి సరే..ఇస్తాను అని చెప్పాను.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం డ్రీమ్ అన్నారు. మరి పవన్ రెండు మూడు సినిమాలు తర్వాత నటనకు గుడ్ చెప్పేస్తాను అంటున్నారు..? మరి..ఎలా..?
పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అదృష్టం ఉంటే చేస్తాను.
24 సినిమాలా ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆలోచన ఉందా..?
భారీ బడ్జెట్ తో ప్రయోగాత్మక చిత్రాలు తీయను. కాకపోతే క్షణం సినిమా తరహాలో చిన్ని సినిమా అయితే...ప్రయోగాత్మక చిత్రం చేస్తాను.
రాజ్ తరుణ్ తో శతమానం భవతి సినిమా ప్లాన్ చేస్తున్నారు కదా..? ఎప్పుడు ప్రారంభం..?
శతమానం భవతి...ఫెస్టివల్ లాంటి సినిమా అనేది క్యాప్షన్. ఆగష్టు లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం. జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
రాజ్ తరుణ్ కథ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడని ప్రచారం జరుగుతుంది..నిజమేనా..?
రాజ్ తరుణ్ కథ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడనే ప్రచారం గురించి నేను విన్నాను..ఎక్కడో చదివాను కూడా. రాజ్ తరుణ్ కి కథ చెప్పడానికి పిలిపిస్తే వచ్చాడు కథ విన్నాడు. వెంటనే చేస్తాను అని చెప్పాడు అంతే కానీ...కథ విషయంలో ఇబ్బంది పెడుతున్నాడనేది వాస్తవం కాదు.
అయితే...శతమానం భవతి రాజ్ తరుణ్ తోనే చేస్తున్నారన్న మాట..?
ఇంతకు ముందు చెప్పినట్టుగా.....ఆగష్టులో ప్రారంభించి జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఆ టైమ్ కి ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరోతో చేస్తాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments