నాలుగోసారి కలుస్తున్నారు...
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్‌తేజ్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన రెండో సినిమానే పిల్లానువ్వులేని జీవితం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి దిల్ రాజు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. తర్వాత సాయిధరమ్‌తేజ్ వరుసగా దిల్‌రాజు కాంబినేషన్‌లో సుబ్రమణ్యం ఫర్ సేల్, రీసెంట్‌గా సుప్రీమ్ చిత్రాల్లో నటించి హ్యాట్రిక్ సక్సెస్‌లను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నాలుగోసారి ఈ హిట్ కాంబినేషన్‌లో నాలుగో సినిమా రూపొందనుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయని, అన్నీ ఓకే కాగానే అక్టోబర్‌లో సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై దిల్ రాజు అండ్ టీం ఏమని స్పందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments