ఐటీ దాడులు, టికెట్ల ధరలు పెంపుపై దిల్‌రాజు స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే జంటగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. మరికొన్ని గంటల్లో అభిమానుల ముందుకు మహర్షి రాబోతున్నాడు. ఈ తరుణంలో టికెట్ల పెంపు వివాదం, షోల పెంపు, సర్కార్ సీరియస్, నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ఇవన్నీ వరుసగా జరిగిపోయాయ్. దీంతో అసలేం జరుగుతోందో తెలియక అటు అభిమానులు, ఇటు చిత్రబృందం ఆందోళన చెందారు. ఈ వ్యవహారంపై ఫైనల్‌గా దిల్‌రాజు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చేశారు. ఐటీ దాడులు జరగడం అన్నది కామన్ అని పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూనే ఉంటాయన్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
షోలు పెంపు..!
"మహర్షి భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా కావడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని ఐదో షోకు అనుమతివ్వాలని అడిగాం. దానికి అంగీకరించి మంగళవారం రోజు ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. ఆ జీవోను అనుసరించి హైదరాబాద్‌లో రేపు 15 నుంచి 18 థియేటర్లలో 8 గంటల షోలు పడతాయి. అలాగే, జిల్లా కేంద్రాలు, మరికొన్ని సెంటర్లలో 8 గంటలకే షోలు ప్రారంభమవుతాయి. ఇవి 30 నుంచి 35 ఉంటాయి. సాధారణంగా తెలంగాణలో ఉదయం 8 గంటల షోల ట్రెండ్ లేదు. ఆంధ్రలో అయితే ఉదయం 5 గంటలకే మొదలైపోతాయి. మేం అనుమతి ఇస్తే వాళ్లు అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా మొదలుపెడతారు" అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
టికెట్ల పెంపు వ్యవహారం..!
"నిన్న జీవో వచ్చిన తరవాత టిక్కెట్ ధరలపై చిన్న మిస్ కమ్యూనికేషన్ ట్రావెల్ అయ్యింది. ఈ టిక్కెట్ ధరలనేవి తెలంగాణ ప్రభుత్వం కాకుండా థియేటర్ యజమానులే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుని రేట్లు పెంచారు. అలాగే ఆంధ్రలో కూడా పెరిగాయి. ఇక్కడ రూ.80 టిక్కెట్‌ను రూ.100 చేశారు. రూ.110ని రూ.125 చేశారు. మల్టీప్లెక్సుల్లో రూ.150 నుంచి రూ.200కి పెంచారు. వీళ్లందరూ కోర్టు అనుమతితో ధరలు పెంచారు. రాజమండ్రిలో సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్ ధర రూ.200గా ఉంది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు ఇలా ఎక్కడ చూసినా ఏపీలో రూ.200 ఉంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లో అత్యధిక టిక్కెట్ ధర రూ.125. బెంగళూరు తీసుకుంటే వీకెండ్లలో టిక్కెట్ ధరలు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటాయి. వాళ్లకు ఆ వెసులుబాటు ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో అది లేదు. మనకు పరిమితి ఉంది. కోర్టు సూచనల మేరకు రేట్లు పెంచుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిందని నిన్న మీడియాలో తప్పుడు వార్త ఒకటి ప్రసారమైంది. ఇది కోర్టు ద్వారా వచ్చింది" అని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్లుగానే టికెట్ 200 చేసేశారు.. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రభుత్వం కోర్టు మొట్లెక్కేందుకు సిద్ధమైంది ఈ తరుణంలో పరిస్థితి ఎలా ఉంటుందో రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout