మరో మల్టీస్టారర్‌కు దిల్‌రాజు ప్లాన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్స్‌లో దిల్‌రాజు ఒకరు. కథలపై నమ్మకంతో చిన్న సినిమాలు, ఇమేజ్‌ను బేస్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు చేస్తూ దిల్‌రాజు తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. క్రేజీ కాంబినేషన్స్‌ను సెట్ చేయడంలోనూ దిల్‌రాజు ముందుంటారు. టాలీవుడ్‌లో ఆగిపోయిన మల్టీస్టారర్ సినిమాలకు విక్టరీ వెంకటేశ్, సూపర్‌స్టార్ మహేశ్‌లను ఒప్పించి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా చేసి హిట్ కొట్టడమే.. ఇద్దరి హీరోల అభిమానులను కూడా మెప్పించేలా సినిమాను నిర్మించాడు దిల్‌రాజు. ఈ స్టార్ ప్రొడ్యూసర్
ఇప్పుడు మరో మల్టీస్టారర్‌కు ప్లాన్ చేశాడట. వివరాల్లోకి వెళితే.. నేటి తరం అప్‌కమింగ్ హీరోల్లో విశ్వక్‌సేన్, కార్తికేయ ఉంటారు. వీరిద్దరినీ కలిపి దిల్‌రాజు ఓ సినిమాను నిర్మించబోతున్నాడట. ఈ సినిమా ద్వారా ఓ ఎడిటర్ దర్శకుడిగా మారుతున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. విశ్వక్ సేన్, కార్తికేయల్లో ఒకరు పాజిటివ్, మరొకరు నెగటివ్ టచ్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com