‘సలార్’ కాంబోతో దిల్‌రాజు ప్లానింగ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభాస్ అనౌన్స్ చేసిన సినిమాలతో కలిపి 24 సినిమాలు అయ్యింది. మరి ప్రభాస్ తన 25వ సినిమాను ఎవరితో చేస్తాడనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో నిర్మాత దిల్‌రాజు .. ప్రభాస్ 25వ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయ్యాడట.
సినీ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు ప్రభాస్‌తో సలార్ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ప్రభాస్ తన 25వ సినిమాను దిల్‌రాజు నిర్మాణంలో చేయబోతున్నాడట. ఇప్పటికే ప్రశాంత్ నీల్.. ప్రభాస్, దిల్‌రాజులకు లైన్ చెప్పాడట. వాళ్లు కూడా ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఇప్పుడున్న కమిట్‌మెంట్స్ ప్రకారం ఈ సినిమా ట్రాక్ ఎక్కాలంటే సులభంగా రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. సలార్‌తో పాటు ఆదిపురుష్ సినిమాను కూడా ప్రభాస్ ట్రాక్ ఎక్కించేశాడు. ఈ రెండు చిత్రాలను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు ప్రభాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments