లైఫ్ లో డైరెక్షన్ చేయను - దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
పాతిక సినిమాలను నిర్మించిన నిర్మాత దిల్‌రాజు. ఈ పాతిక చిత్రాల్లో చాలా వరకు సూపర్‌హిట్ చిత్రాలే ఉన్నాయి. ఇన్ని హిట్స్ సాధించడానికి కారణం స్క్రిప్ట్ సెలక్షన్ నుండే దిల్‌రాజు ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. రషెష్ చూసి ఏమైనా రీ షూట్స్ చేయమని కూడా సలహాలు కూడా ఇస్తుంటాడు. సినిమాపై ఇంత మంచి గ్రిప్ ఉన్న దిల్‌రాజు డైరెక్షన్ చేయవచ్చు కదా అని..చేస్తాడేమో అని కూడా వార్తలు వినపడుతుంటాయి.
ఇదే విషయమై డిజె దువ్వాడ జగన్నాథమ్ ట్రైలర్ కార్యక్రమంలో పాల్గొన్న కొంత మంది దర్శకులు దిల్‌రాజు గురించి మాట్లాడారు. అయితే దిల్‌రాజు మాత్రం తాను లైఫ్‌లో డైరెక్షన్ చేయనని క్లారిటీ ఇచ్చేశాడు. ఎందుకంటే స్క్రిప్ట్ సెలక్షన్ చేయడం, తప్పొప్పులు చెప్పడం చాలా సులభమేనని, అయితే ఓ సినిమాను ఎలా తీయాలనే ఆలోచన దర్శకుడికి మాత్రమే ఉంటుందని, దర్శకులు ఆ విషయంలో చాలా టెన్షన్ పడుతుంటారు. ఆ పని తాను చేయలేను కాబట్టి తాను డైరెక్షన్ చేయలేనని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com