ఆ సినిమాను దిల్‌రాజు చేయడం లేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
1996లో కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే. 21 ఏళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోందని అధికారక వార్తలు వినిపించాయి. ఆసక్తికరమైన విషయమేమంటే, ఈ సినిమాను దిల్‌రాజు `ఇండియన్ 2` పేరుతో నిర్మిస్తాడని అన్నారు. కానీ కారణాలు తెలియడం లేదు కానీ..ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నుండి దిల్‌రాజు తప్పుకున్నాడట.
ముందు దిల్‌రాజు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అవుతుండటం ఒకటి. శంకర్‌లాంటి దర్శకుడిని ఓ పర్టికులర్ టైంలో ప్రాజెక్ట్ క్లోజ్ చేయాలని నిలదీయడం కూడా కష్టమే. దిల్‌రాజు పక్కకు తప్పుకోవడానికి ఇవే కారణాలుగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడక్షన్స్ హ్యాండిల్ చేయనుందట. ప్రస్తుతం రనజీకాంత్, శంకర్ `2.0`సినిమాను కూడా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఈ నిర్మాణ సంస్థ చేయడం విశేషమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com