ఆ సినిమాను దిల్‌రాజు చేయ‌డం లేదా?

  • IndiaGlitz, [Saturday,October 21 2017]

1996లో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిందో తెలిసిందే. 21 ఏళ్ల‌కు ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంద‌ని అధికార‌క వార్త‌లు వినిపించాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, ఈ సినిమాను దిల్‌రాజు 'ఇండియ‌న్ 2' పేరుతో నిర్మిస్తాడ‌ని అన్నారు. కానీ కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ..ఈ ప్రాజెక్ట్ ప్రొడ‌క్ష‌న్ నుండి దిల్‌రాజు త‌ప్పుకున్నాడ‌ట‌.

ముందు దిల్‌రాజు అనుకున్న బ‌డ్జెట్ కంటే ఎక్కువ అవుతుండ‌టం ఒక‌టి. శంక‌ర్‌లాంటి ద‌ర్శ‌కుడిని ఓ ప‌ర్టికుల‌ర్ టైంలో ప్రాజెక్ట్ క్లోజ్ చేయాల‌ని నిల‌దీయ‌డం కూడా క‌ష్ట‌మే. దిల్‌రాజు ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డానికి ఇవే కార‌ణాలుగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను లైకా ప్రొడ‌క్ష‌న్స్ హ్యాండిల్ చేయ‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం ర‌న‌జీకాంత్‌, శంక‌ర్ '2.0'సినిమాను కూడా లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ఈ నిర్మాణ సంస్థ చేయ‌డం విశేష‌మే.