దిల్ రాజు బ్యానర్ లో నాని....
Send us your feedback to audioarticles@vaarta.com
భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత యంగ్ హీరో నాని ఇంద్రమోహనకృష్ణ దర్శకత్వంలో సినిమాను పూర్తి చేశాడు. జెంటిల్ మన్ పేరుతో సినిమా విడుదల కానుంది. అయితే త్వరలోనే నాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా నిర్మించనున్న చిత్రంలో హీరోగా నటించనున్నాడు.
మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ చిత్రాల ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ స్క్రిప్ట్ కొత్తగా ఉంటుందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై, ఆగస్టు నుండి సెట్స్ లోకి వెళుతుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com