దిల్‌రాజు మెగా మల్టీస్టారర్..?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లిస్ట్‌లో దిల్‌రాజు ఒకరు. చిన్న చిత్రాలు, మీడియం బడ్జెట్ చిత్రాలతో పాటు.. హై బడ్జెట్, స్టార్ మూవీస్ చేస్తున్నారాయన. ఒకప్పుడు ఆగిపోయిన మల్టీస్టారర్ చిత్రాలకు `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు` చిత్రంతో మళ్లీ ఊపు తెచ్చింది మాత్రం దిల్‌రాజు అనే చెప్పాలి. ఇప్పుడు చాలా మల్టీస్టారర్సే రూపొందుతున్నాయి. కాగా.. ఇప్పుడు దిల్‌రాజు మరో మల్టీస్టారర్‌కు ప్లాన్ చేస్తున్నారట. ఈ మల్టీస్టారర్‌లో మెగా హీరోలను నటింప చేయడానికి దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నాడట. వినపడుతున్న సమాచారం మేరకు ఈ మల్టీస్టారర్‌లో వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ నటిస్తారని టాక్.
వీరిద్దరితో దిల్‌రాజు చర్చలు జరుపుతున్నారని టాక్. `ఎవరు` సినిమాతో డైరెక్టర్‌గా తనేంటో ప్రూవ్ చేసుకున్న వెంకట్ రామ్‌జీ కథను సిద్ధం చేస్తున్నారట. అయితే వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ ఉన్న కమిట్మెంట్స్తో బిజీ బిజీగా ఉన్నారు. వీరిద్దరూ మరి దిల్‌రాజు ఆలోచనకు ఏమంటారో తెలియాల్సి ఉంది. వీరిద్దరూ ఓకే అంటే మాత్రం.. మెగా మల్టీస్టారర్‌ను తెరపై చూడొచ్చు. గతంలో శర్వానంద్, నితిన్‌తో ఓ మల్టీస్టారర్ చేయాలనుకున్న దిల్‌రాజు చివరి నిమిషంలో కథ నచ్చక వదిలేశాడు. మరిప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ఎంత వరకు వెళుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com