దిల్ రాజు విడుదల చేసిన 'ఒక్కడొచ్చాడు' ఆడియో

  • IndiaGlitz, [Tuesday,November 08 2016]

మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ చిత్రాన్ని నవంబర్‌ 18న గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు. దిల్‌రాజు బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా....

హీరో విశాల్ మాట్లాడుతూ - ''క‌త్తిసండై అనే సినిమాను తెలుగులో ఒక్క‌డొచ్చాడు అనే పేరుతో తెలుగులో న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నాం. ఈ సినిమా ల‌వ్‌, యాక్ష‌న్‌, కామెడి స‌హా అన్నీ ఎలిమెంట్స్ ప‌క్క‌గా కుదిరాయి. వ‌డివేలుగారు ఐదేళ్ల త‌ర్వాత ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఎంట్రీ ఇస్తున్నారు. త‌మ‌న్నాతో మొద‌టిసారి క‌లిసి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది. సురాజ్‌తో తొలిసారి చేసిన సినిమా. ద‌ర్శ‌కుడుగా ఇలాగే చేయాల‌నే ఈగో ఏమీ పెట్టుకోకుండా అంద‌రి స‌ల‌హాలు వింటూ అందులో మంచి స‌ల‌హా తీసుకుంటూ సినిమాను ఓ టీమ్‌గా చేశాం. సినిమా బాగా రావాల‌ని టీం అంతా క‌ష్ట‌ప‌డ్డాం. స‌మాజంలోని ప్ర‌తి మ‌నిషి మైండ్‌కు ఓ వాయిస్ ఉంటుంది. ఆ మైండ్‌వాయిస్‌తో ఈ సినిమాలో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చింది. సినిమాలో చివ‌రి ముప్పై నిమిషాలు ఓ విష‌యం చెబుతున్నాను. అదేంట‌నేదో సినిమా చూసే తెలుసుకోవాలి. హిప్ హాప్ త‌మిళ అద్భుత‌మైన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. నేను న‌టుడిగా ఇంకా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాను. కాబ‌ట్టి నేను అభిమానులు ఇవ్వాల‌నుకునే యాక్ష‌న్ లెజెండ్ బిరుదులేవీ వ‌ద్దు..నేను విశాల్‌గానే ఉండాల‌నుకుంటున్నాను. నా వ‌ల్ల వీలైనంత‌గా సోసైటీకి స‌పోర్ట్ చేస్తున్నాను. అమ్మాయి చ‌దువుకోసం తోడ్పాటునందిస్తున్నాను'' అన్నారు.విశాల్ నాకు ఇన్‌స్పిరేష‌న్‌

త‌మ‌న్నా మాట్లాడుతూ - ''ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి నిర్మాత హ‌రిగారే కార‌ణం. ప్ర‌తి విష‌యాన్ని ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. సినిమాటోగ్రాఫ‌ర్ రిచర్డ్స్ ప్ర‌తి విజువ‌ల్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. సినిమా క్లాస్ లుక్‌లో ఉంటుంది. హిప్ హాప్ త‌మిళ మ్యూజిక్ సూప‌ర్బ్‌. విశాల్ మంచి న‌టుడు, ఫైట్స్‌, డ్యాన్సులు చ‌క్క‌గా చేస్తాడు. ఈ సినిమాలో మంచి పెర్‌ఫార్మెన్స్ చేశాడు. విశాల్ మంచి యాక్ట‌రే కాదు, మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. విశాల్ వ్య‌క్తిగా నాకు చాలా ఇన్‌స్పిరేష‌న్‌. నేను, విశాల్ చేసిన ఒక్క‌డొచ్చాడు ఈ న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌వుతుంది. అంద‌రూ సినిమాను చూసి పెద్ద హిట్ చేస్తార‌ని భావిస్తున్నాను'' అన్నారు. సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంది

దిల్‌రాజు మాట్లాడుతూ - ''నేను బొమ్మ‌రిల్లు సినిమా చేసిన‌ప్పుడు హ‌రి ఆ సినిమాను చెన్నైలో విడుద‌ల చేశాడు. అప్ప‌టి నుండి త‌న‌తో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. త‌న‌కు ఈ సినిమా మంచి హిట్ కావాల‌ని కోరరుకుంటున్నాను. పందెంకోడి సినిమాతో త‌నెంటో ప్రూవ్ చేసుకున్న విశాల్ ప‌న్నెండేళ్లుగా నిజాయితీతో హార్డ్‌వ‌ర్క్ చేస్తూ మంచి విజ‌యాల‌ను సాధించాడు. బాహుబ‌లి ముందు త‌మ‌న్నా వేరు, త‌ర్వాత త‌మ‌న్నా వేరు. త‌ను చేసే సినిమాలే త‌నెంటో మాట్లాడుతున్నాయి. ట్రైల‌ర్ చాలా బావుంది. హిప్ హాప్ త‌మిళ సంగీతం బావుంది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు'' అన్నారు.

ఒక్క‌డొచ్చాడు సినిమాతో నిర్మాత హ‌రిగారు పెద్ద నిర్మాత‌గా పేరు తెచ్చుకోవాలి. త‌మ‌న్నా డ్యాన్స్ చూడ‌టానికి, విశాల్‌గారి న‌ట‌న చూడ‌టానికి ఈ సినిమా కోసం నేను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని శ్రీదివ్య తెలిపారు. హ‌రి మంచి ప్యాష‌న్ ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్‌. ఈ సినిమాను హ‌రి ప్రొడ్యూస్ చేయ‌డం ఆనందంగా ఉంది. పందెంకోడిలా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. సురాజ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా చేయ‌డంలో దిట్ట‌. ఒక్క‌డొచ్చాడు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్ష‌న్ కూడా ఉంటుంద‌ని బెల్లంకొండ సురేష్ చెప్పారు.

విశాల్‌గారు 'ఒక్క‌డొచ్చాడు' కోసం చాలా స‌పోర్ట్ చేశారు. మంచి ఎంట‌ర్‌టైనింగ్‌తో కూడుకున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. త‌మ‌న్నా గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. న‌ట‌న‌, డ్యాన్సుల్లో మ‌రోసారి త‌నంటే ఈ సినిమాలో నిరూపిస్తుంది. మంచి టీం స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం. స‌పోర్ట్ చేసిన అందరికీ థాంక్స్ అని ద‌ర్శ‌కుడు సురాజ్ అన్నారు
ఒక్క‌డొచ్చాడు అన్ని హంగులున్న మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. మంచి మ్యూజిక్‌కు మంచి సాహిత్యం కుదిరింది. సినిమా న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌వుతుందని మాట‌ల ర‌చ‌యిత రాజేష్ తెలియ‌జేశారు. పాట‌ల ర‌చ‌యిత డా.చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి మాట్లాడుతూ..విశాల్‌గారి రాయుడు సినిమాలో ఒక పాట రాశాను . ఆ పాట న‌చ్చ‌డంతో నిర్మాత హ‌రిగారు ఈ సినిమాలో పాట‌లు రాసే అవ‌కాశం ఇచ్చారు. ముందు ఒక పాట రాయ‌మ‌న్నారు. ఆ పాట న‌చ్చ‌డంతో మ‌రో పాట ఇచ్చారు. అలా అన్ని పాట‌లు రాసే అవకాశం వ‌చ్చింది. ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన నిర్మాత హ‌రిగారికి థాంక్స్‌.. అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ రిచ‌ర్డ్‌, సి.కల్యాణ్‌, మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, మెహ‌రీన్‌, సీడెడ్ ల‌క్ష్మీకాంత్ రెడ్డి, ప్ర‌స‌న్న‌కుమార్‌.టి, శ్రీనివాస్‌, కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, జ‌య‌ప్ర‌కాష్ త‌దిత‌రులు పాల్గొని యూనిట్‌ను అభినందించారు. విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.

More News

'జయమ్మునిశ్చయమ్మురా' సెన్సార్ పూర్తి

శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ ఫిలింస్ పతాకంపై..

ఆకలి వేసినప్పుడు తినే సింహాన్ని అంటూ అదరగొట్టేస్తున్న ఎస్ 3 టీజర్..!

సూర్య,హరి కాంబినేషన్లో సింగం సిరీస్ లో వస్తున్న మూడవ చిత్రం ఎస్ 3.ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క,శృతిహాసన్ నటిస్తున్నారు.

'సాహసం శ్వాసగా సాగిపో' నిమాపై చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం - నిర్మాత మిర్యాల రవీందర్

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో. మిర్యా లసత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్నారు.

సరదాగా ఒక శాంపిల్ చూస్తారేటి? అంటున్న కృష్ణ భగవాన్ !!

క్లైమాక్స్ ఫైట్ లో చిరు...

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 శరవేగంగా చిత్రీకరణను జరుపకుంటుంది.