'పీనట్ డైమండ్' టీజర్ విడుదల చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ..!!
Send us your feedback to audioarticles@vaarta.com
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ ప్రధాన పాత్రలలో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం `పీనట్ డైమండ్`. ప్రొడక్షన్ నెం.1గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని టాలీవుడ్ టాప్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు..
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. పీనట్ డైమండ్..టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా వస్తున్న ఈ సినిమా టీజర్ నేను రిలీజ్ చాలా ఆనందంగా ఉంది.. టీజర్ చూశాను.. ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా అంతే బాగుంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఈ సినిమా కూడా మంచి డిఫరెంట్ కంటెంట్ తో రాబోతుంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను.. వెంకటేష్ త్రిపర్ణ రాసిన డైలాగ్స్ బాగున్నాయి.. దర్శకత్వం గురించి చెప్పనవసరం లేదు. ఆ షాట్స్ చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ సినిమా కి ఎంత ఖర్చు పెట్టారో ఆ సినిమా క్వాలిటీ ని చూస్తుంటేనే తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్నారు..
అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com