50 ప్లస్‌లో మరోసారి తండ్రి కాబోతోన్న దిల్‌రాజు.. ?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు 50 ప్లస్ ఏజ్‌లో మరోసారి తండ్రి కానున్నారు. ఆయన మొదటి భార్య అనిత అనారోగ్యంతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా లాక్డౌన్ సమయంలో దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే ఓ కుమార్తె హన్షిత రెడ్డి ఉన్నారు. తన తల్లి మరణానంతరం ఆమె, బంధువుల కోరిక మేరకు తేజస్విని రెడ్డిని దిల్‌రాజు వివాహం చేసుకున్నారు. ద్వితీయ వివాహం అనంతరం లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ దంపతులు. ఈ క్రమంలో తేజస్విని ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే వార్తలు గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఈ జంట ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇకపోతే.. ఇటీవల దిల్‌రాజు గాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా గ్రూపుతో కలిసి స్టేజ్ మీద పాట పాడి సందడి చేశారు. కింగ్ నాగార్జున నటించిన నిర్ణయం సినిమాలోని 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్...' అనే పాటను ఉల్లాసంగా ఆలపించారు. అయితే ఈ పాటను దిల్‌రాజు తన శ్రీమతికి డెడికేట్ చేసినట్లు తెలుస్తుంది. కాగా.. తేజస్విని రెడ్డిని దిల్‌రాజు టాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.. ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించిన ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబోలో పాన్ ఇండియా సినిమా రూపొందిస్తున్నారు దిల్ రాజు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న 50వ సినిమా కావడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments