దిల్ రాజు కాస్టింగ్ కాల్ ఫ‌ర్ వ‌రుణ్ తేజ్ మూవీ..

  • IndiaGlitz, [Tuesday,June 07 2016]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ను త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...ఈ చిత్రంలో 8 నుంచి 12 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న చిన్న‌పిల్లోడు క్యారెక్ట‌ర్ ఉంద‌ట‌. ఈ క్యారెక్ట‌ర్ ని కొత్త వాళ్ల‌తో చేయించాల‌నుకుంటున్నారు.

ఆస‌క్తి ఉన్న వాళ్లు సంప్ర‌దించ‌మ‌ని ప్ర‌క‌ట‌న కూడా ఇచ్చారు. అయితే..తెలుగు మాట్లాడాలి.అది కూడా అమెరిక‌న్ స్లాంగ్ లో మాట్లాడేవారికి ప్రాధాన్య‌త అంటున్నారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించే శేఖ‌ర్ క‌మ్ముల వ‌రుణ్ తేజ్ ను ఎలా చూపించ‌నున్నారో..? ఎలాంటి క‌థ ఎంచుకున్నారో అనేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్..!