దిల్‌రాజుకి టెన్షన్... మాటిచ్చిన పవన్ కళ్యాణ్
- IndiaGlitz, [Tuesday,March 24 2020]
దిల్‌రాజు పెద్ద టెన్షన్ పట్టుకుంది. కరోనా వైరస్‌తో ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ స్తంభించింది. థియేటర్స్ మూత పడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ దిల్‌రాజుపై బలంగానే పడిందట. ఎందుకో తెలుసా? దిల్‌రాజు ఎంతో ప్రెస్టీజియస్‌గా పవన్‌కల్యాణ్‌తో వకీల్‌సాబ్ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల నుండి పవన్‌తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్న దిల్‌రాజుకు ఎట్టకేలకు పవన్‌తో సినిమా చేసే అవకాశం దక్కింది. అన్నీ సజావుగా సాగితే మే 15న సినిమాను విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా దెబ్బకు సినిమా షూటింగ్ ఆగింది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. 20 శాతం పూర్తయితే దిల్‌రాజుకు టెన్షన్ లేదు. అయితే పవన్ కోసం మరోవైపు ఎ.ఎం.రత్నం కాచుకుని కూర్చున్నాడు. క్రిష్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి తన సినిమాను పవన్ ఎక్కడా వాయిదా వేస్తాడేమోనని దిల్‌రాజుకి టెన్షన్ మొదలైంది.
అయితే ఈ విషయమై పవన్‌ను దిల్‌రాజు కలిస్తే వకీల్‌సాబ్ పూర్తయిన తర్వాతే క్రిష్, ఎ.ఎం.రత్నం సినిమాను స్టార్ట్ చేస్తానని భరోసా ఇచ్చాట. దీంతో దిల్‌రాజు గుండెలపై బరువు దిగినట్లు అయ్యిందని వార్తలు వినపడుతున్నాయి. వకీల్‌సాబ్ బాలీవుడ్ చిత్రం పింక్‌కు రీమేక్. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.