‘వకీల్ సాబ్’కు వెళ్లి.. రచ్చ రచ్చ చేసిన దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన‘వకీల్ సాబ్' సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిందే. అయితే నిన్న రాత్రే యూఎస్‌లో 'వకీల్ సాబ్' ప్రీమియర్ షోస్ పడ్డాయి. అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ నుంచి కూడా 'వకీల్ సాబ్' మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. యూఎస్ పబ్లిక్ టాక్ పాజిటివ్‌గా వస్తోంది. బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజానికి బాలీవుడ్‌లో ఇంతటి హీరోయిజం కానీ.. పాటలు కానీ.. యాక్షన్ సన్నివేశాలకు కానీ.. లవ్ యాంగిల్‌కు కానీ తావు లేదు. కానీ పవన్ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్... ఆయన అభిమానులు మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారు.
దీంతో అభిమానులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో సినిమా విడుదలవడం పవన్ అభిమానులకే కాకుండా.. ప్రతీ మూవీ లవర్‌కి మంచి కిక్ ఇచ్చింది. దీంతో మొదటి రోజు మొదటి షో చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరిచారు. దీంతో మూవీ టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆ ఆసక్తికి అయితే ‘వకీల్ సాబ్’ ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రేక్షకులంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు మాత్రమేనా చిత్ర యూనిట్ కూడా ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేసింది.
దర్శక నిర్మాతలు .. మిగతా చిత్ర బృందం 'వకీల్ సాబ్' బెఫిట్ షోస్‌లో నానా హంగామా చేశారు. ముఖ్యంగా 'వకీల్ సాబ్' నిర్మాత దిల్ రాజు తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లారు. ఆయన థియేటర్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రేక్షకులతో కలిసి హంగామా చేశారు. నిర్మాతన్న విషయం కూడా మర్చిపోయి పవన్ స్క్రీన్ మీద కనిపించగానే పేపర్లు ఎగరవేసి నానా రచ్చ చేసేశారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన హంగామా తాలుకు వీడియో సోషఅల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments