‘వకీల్ సాబ్’కు వెళ్లి.. రచ్చ రచ్చ చేసిన దిల్ రాజు

  • IndiaGlitz, [Friday,April 09 2021]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన‘వకీల్ సాబ్‌' సినిమా నేడు(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిందే. అయితే నిన్న రాత్రే యూఎస్‌లో 'వకీల్ సాబ్‌' ప్రీమియర్ షోస్ పడ్డాయి. అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ నుంచి కూడా 'వకీల్ సాబ్‌' మంచి సక్సెస్ టాక్‌ను సంపాదించుకుంది. యూఎస్ పబ్లిక్ టాక్ పాజిటివ్‌గా వస్తోంది. బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. నిజానికి బాలీవుడ్‌లో ఇంతటి హీరోయిజం కానీ.. పాటలు కానీ.. యాక్షన్ సన్నివేశాలకు కానీ.. లవ్ యాంగిల్‌కు కానీ తావు లేదు. కానీ పవన్ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు వేణు శ్రీరామ్... ఆయన అభిమానులు మెచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారు.

దీంతో అభిమానులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హీరో సినిమా విడుదలవడం పవన్ అభిమానులకే కాకుండా.. ప్రతీ మూవీ లవర్‌కి మంచి కిక్ ఇచ్చింది. దీంతో మొదటి రోజు మొదటి షో చూసేందుకు ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరిచారు. దీంతో మూవీ టికెట్స్ ఆన్‌లైన్‌లో పెట్టిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఆ ఆసక్తికి అయితే ‘వకీల్ సాబ్’ ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రేక్షకులంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరు మాత్రమేనా చిత్ర యూనిట్ కూడా ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేసింది.

దర్శక నిర్మాతలు .. మిగతా చిత్ర బృందం 'వకీల్ సాబ్‌' బెఫిట్ షోస్‌లో నానా హంగామా చేశారు. ముఖ్యంగా 'వకీల్ సాబ్‌' నిర్మాత దిల్ రాజు తన భార్యతో కలిసి సినిమాకు వెళ్లారు. ఆయన థియేటర్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రేక్షకులతో కలిసి హంగామా చేశారు. నిర్మాతన్న విషయం కూడా మర్చిపోయి పవన్ స్క్రీన్ మీద కనిపించగానే పేపర్లు ఎగరవేసి నానా రచ్చ చేసేశారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన హంగామా తాలుకు వీడియో సోషఅల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More News

లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన మోదీ

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత ఏడాదిని మించి ఈ ఏడాది కేసులు నమోదవుతున్నాయి.

‘లవ్ స్టోరీ’ రిలీజ్ విషయంలో అనూహ్య నిర్ణయం..

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని గడగడలాడిస్తోంది. కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో ఆ ఎఫెక్ట్ సినిమాల విడుదలపై కూడా పడుతోంది.

ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్ 'లెవన్త్‌అవర్‌' : ప్రవీణ్‌ సత్తారు

చందమామ కథలు, గుంటూరు టాకీస్‌, పిఎస్‌వి గరుడవేగ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు

ఏపీలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ వివాదం స్టార్ట్

పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే టికెట్ ధరలు పెంచాలని.. రిలీజైన రెండు, మూడు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా రాబట్టుకోవాలని నిర్మాతలు, పంపిణీ దారులు భావిస్తున్నారు.

‘మా’ క్రమశిక్షణా సంఘానికి చిరు రాజీనామా?

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) క్రమ శిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా చేశారని తెలుస్తోంది.