త్వరలో సినిమా హీరోగా దిల్‌రాజు వారసుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
వారసత్వ హీరోలు తెలుగు సినిమాలకు కొత్తేం కాదు.. హీరో, దర్శకుడు, నిర్మాతలు ఇలా అందరూ కొడుకులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఆ కోవలోకి ఇప్పుడు దిల్‌రాజు ఫ్యామిలీ చేరనుంది. వివరాల్లోకెళ్తే.. దిల్‌రాజు సోదరుడు.. నిర్మాత శిరీశ్ తనయుడు ఆశిశ్ రెడ్డి హీరోగా సినీ ఎంట్రీ త్వరలోనే జరుగనుంది.
అధికారకంగా వివరాలను త్వరలోనే ప్రకటిస్తారట. `పలుకే బంగారు మాయేనా` అనే టైటిల్ కూడా ఫిక్సయ్యింది. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని దిల్‌రాజు తెలిపారు. ఇప్పటికే దిల్‌రాజు ఫ్యామిలీ నుండి హర్షిత్ రెడ్డి నిర్మాణ రంగంలో రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments