3 పండగలకు 3 సినిమాలు రెడీ చేస్తున్న దిల్ రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పీడు పెంచి వరుసగా సినిమాలు రెడీ చేస్తున్నారు. 3 పండగలకు 3 సినిమాలను రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేసారు. ఇంతకీ ఆ మూడు పండుగలు ఏమిటి..? ఆ మూడు సినిమాలు ఏమిటి అనుకుంటున్నారా..? ముందుగా చెప్పుకోవాల్సింది ఈరోజే ప్రారంభించిన నేను లోకల్ గురించి. ఈ చిత్రంలో నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. సినిమా చూపిస్త మావ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇడియట్ తరహాలో ఉండే ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
నేను లోకల్ తర్వాత చెప్పుకోవాల్సింది శతమానంభవతి. ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. వేగేశ్న సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బొమ్మరిల్లు చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తే....శతమానంభవతిలో తాత మనవడు మధ్య అనుబంధాన్ని చూపించనున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.
నేను లోకల్, శతమానంభవతి...ఈ రెండు చిత్రాల తర్వాత చెప్పుకోవాల్సింది అల్లు అర్జున్ మూవీ. హరీష్ శంకర్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించే ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా...క్రిస్మస్, సంక్రాంతి, సమ్మర్ సీజన్స్ లో ఏ సీజన్ మిస్ కాకుండా పక్కా ప్లాన్ రెడీ చేసిన దిల్ రాజు ఈ చిత్రాలతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com