దిల్ రాజు.. నాలుగోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కలిసొచ్చిన సీజన్ వేసవి. ఈ సీజన్‌లో రిలీజ్ చేసిన చాలా సినిమాలు రాజుకు మంచి విజయం అందించాయి. వేసవి తరువాత దిల్ రాజుకి కలిసొచ్చిన మరో సీజన్ ఉంది. అదే సంక్రాంతి. 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 2014లో ఎవడు, 2017లో శతమానం భవతి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. మరోసారి.. ఇదే సీజన్‌కు తన సినిమాని తీసుకురాబోతున్నారాయన. ఆ వివరాల్లోకి వెళితే.. మహేష్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 10 లేదా 12 నుంచి డెహ్రడూన్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నార్త్ ఇండియా, న్యూయార్క్, కర్నూల్.. ఇలా పలు ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించనున్నారు. డిసెంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసి.. జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. మరి.. ఇప్పటికే మూడు సార్లు సంక్రాంతి సీజన్‌లో విజయాలు అందుకున్న దిల్ రాజు మరోసారి ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తారేమో చూడాలి. అన్నట్టు.. ఈ సినిమాకి మరో నిర్మాతగా సి.అశ్వనీదత్ వ్యవహరించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments