రిస్క్ చేస్తున్న దిల్‌రాజు

  • IndiaGlitz, [Saturday,June 08 2019]

స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మాత‌.. కేవ‌లం సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటాడు. సినిమా వ్యాపారాన్ని ఓ లెక్క ప్ర‌కారం చేసే దిల్‌రాజు రిస్క్ చేశాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కు దిల్‌రాజు చేసిన రిస్క్ ఏంటి? అనే వివ‌రాల్లోకెళ్తే.. దిల్‌రాజు సాహో హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు ద‌క్కించుకోవ‌డ‌మేన‌ట‌. 2:1 నిష్ప‌త్తిలో నైజాం, ఉత్త‌రాంధ్ర హ‌క్కుల‌ను 45 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించి సొంతం చేసుకున్నాడంటున్నారు.

'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన సినిమానే కావ‌చ్చు. కానీ అంత పెద్ద మొత్తం చెల్లించి హ‌క్కుల‌ను సొంతం చేసుకోవ‌డమంటే రిస్క్ చేస్తున్న‌ట్లేన‌ని అనుకుంటున్నారు. అయితే దిల్‌రాజు లెక్క‌లు దిల్‌రాజుకుంటాయ‌ని మ‌రో వ‌ర్గం అంటుంది. మ‌రి రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాతే ఓ క్లారిటీ వ‌స్తుంది. 'సాహో' సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. సుజీత్ ద‌ర్శ‌కుడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌.