రిస్క్ చేస్తున్న దిల్రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత.. కేవలం సినిమాలను నిర్మించడమే కాదు.. డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటాడు. సినిమా వ్యాపారాన్ని ఓ లెక్క ప్రకారం చేసే దిల్రాజు రిస్క్ చేశాడని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు దిల్రాజు చేసిన రిస్క్ ఏంటి? అనే వివరాల్లోకెళ్తే.. దిల్రాజు సాహో హక్కులను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోవడమేనట. 2:1 నిష్పత్తిలో నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను 45 కోట్ల రూపాయలను చెల్లించి సొంతం చేసుకున్నాడంటున్నారు.
`బాహుబలి` తర్వాత ప్రభాస్ నటించిన సినిమానే కావచ్చు. కానీ అంత పెద్ద మొత్తం చెల్లించి హక్కులను సొంతం చేసుకోవడమంటే రిస్క్ చేస్తున్నట్లేనని అనుకుంటున్నారు. అయితే దిల్రాజు లెక్కలు దిల్రాజుకుంటాయని మరో వర్గం అంటుంది. మరి రేపు సినిమా విడుదలైన తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది. `సాహో` సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. సుజీత్ దర్శకుడు. శ్రద్ధాకపూర్ హీరోయిన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Darshan Vignesh
Contact at support@indiaglitz.com
Comments