'ఎంసీఏ'తో ఈ ఏడాది మా బ్యానర్లో డబుల్ హ్యాట్రిక్ కొడుతున్నాం - దిల్‌రాజు
Send us your feedback to audioarticles@vaarta.com
డబుల్ హ్యాట్రిక్ హీరో.. నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ఫై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ..
మెంబర్ ఆప్ పార్లమెంట్ పసునూరి దయాకర్ మాట్లాడుతూ - "ఫ్యామిలీ చిత్రాలు చేయడంలో దిల్రాజుగారిది ప్రత్యేకమైన శైళి. నానికి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడే నెలపైగా ఈ సినిమాను షూటింగ్ చేశారు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది" అన్నారు.
ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ - "దిల్‌రాజు ఫిదా సినిమాను ఇక్కడ షూటింగ్ చేస్తానని మాటిచ్చి, మాట తప్పాడు. అయితే 'ఎంసీఏ' సినిమాను ఇక్కడే చిత్రీకరించడం మాకు ఆనందంగా ఉంది. చిత్రీకరణకు కావాల్సిన పర్మిషన్స్‌ను కల్పించడానికి మేం ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. ఇక్కడ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది" అన్నారు.
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ - "దిల్‌రాజుగారికి ఈ 'ఎంసీఏ' సినిమాతో సక్సెస్ రేటు పెరుగుతుంది. నాని, సాయిపల్లవి సహా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్" అన్నారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ - "దిల్‌రాజుగారితో ఈ ఏడాది వరుసగా మూడు సినిమాలు చేశాను. ఆయనతో కలిసి ఇంకా సినిమాలు చేస్తాను. వేణుశ్రీరామ్ ఎక్స్ట్రార్డినరీ కథను అంత కంటే బాగా తెరకెక్కించారు. చంద్రబోస్‌గారు, శ్రీమణి, బాలాజీగారు ట్యూన్స్‌కు తగ్గట్లు చక్కగా సాహిత్యాన్ని అందించారు. నాని, సాయిపల్లవి ఇద్దరూ నేచరల్‌గా నటించారు..అందుకే నేచరల్ స్టార్స్" అయ్యారు.
డైరెక్టర్ వేణు శ్రీరామ్ మాట్లాడుతూ - "ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయో, అమ్మాయో అని అందరూ అంటున్నారు. నేను చెప్పే అర్థమేమంటే మిడిల్ క్లాస్ ఆడియెన్స్ అని అర్థం. మిడిల్ క్లాస్ అంటే స్టేటస్ కాదు. మైండ్ సెట్. అలాంటి మైండ్ సెట్ ఉన్న ప్రతి వారికీ ఈ సినిమా నచ్చుతుంది. దేవిశ్రీప్రసాద్, రామాంజనేయులు, ప్రవీణ్ పూడి, సమీర్ రెడ్డి అందరికీ థాంక్స్. ఈ ప్రాజెక్ట్ కిక్ స్టార్ట్ అయ్యిందంటే అందుకు ప్రధాన కారణం నా సోదరుడు నానియే. చాలా కో ఆపరేటివ్ పర్సన్. సినిమాను వరంగల్‌ను ఎక్కువ భాగం షూటింగ్ చేశాం. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్" అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - "మేం వరంగల్‌లో షూటింగ్ చేసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్‌రావుగారికి ఫోన్ చేయగానే ఆయనే దగ్గరుండి అన్ని పర్మిషన్స్ ఇప్పించారు. అలాగే పోలీస్ కమీషనర్‌గారు సహకారం అందించారు. వారికి థాంక్స్. ఈ సినిమా దర్శకుడు వేణు కథే ఈ సినిమా. 'నేను లోకల్' షూటింగ్లో ఉన్నప్పుడే నానికి ఈ కథను చెప్పాం. తనకి బాగా నచ్చడంతో చేస్తానని చెప్పాడు. అలాగే సాయిపల్లవి కూడా 'ఫిదా' షూటింగ్లో ఉన్నప్పుడే ఈ కథను చెప్పాం. తనకు కూడా నచ్చి చేస్తానని చెప్పింది. ఇద్దరూ నేచరల్ పెర్ఫార్మర్స్. బాగా చేశారు.
ఇక నాని వరుస సక్సెస్‌లు సాధించడానికి కారణం ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలే. నానితో పాటు సాయిపల్లవి, భూమిక, విజయ్ వర్మ ..నాలుగు పిల్లర్స్‌లా ఎవరి రేంజ్లో వారు అద్భుతమైన పెర్ఫామెన్స్ చేశారు. భూమికగారు ఎలాంటి బ్లాక్‌బస్టర్స్ మూవీస్‌లో నటించారో మనకు తెలుసు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమా చూసిన వారందరూ భూమికగారి గురించి అద్భుతంగా చెబుతున్నారు.
'శతమానం భవతి'లో తల్లిదండ్రులు గురించి చెబితే, 'ఫిదా'లో నాన్న, కూతురి గురించి చెప్పాం. ఎంసీఏ సినిమా అన్న వదిన, మరిది మధ్య అనుబంధాన్ని చెప్పే కథ. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. ఇక సెకండాఫ్ చూసి బయటకొచ్చే ప్రేక్షకులు ఓ మంచి సినిమాను చూసి బయటకొచ్చామనే ఫీలింగ్‌తో ఉంటారు.
తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఒకే ఏడాది ఐదు హిట్ సినిమాలు చేశాం. ఈ సినిమాతో కూడా సక్సెస్ కొడితే డబుల్ హ్యాట్రిక్ అవుతుంది. ప్రేక్షకుల నచ్చేలా సినిమా చేశాం. ఇక సాంకేతిక నిపుణులు గురించి చెప్పాలంటే దేవిశ్రీ నాకు ఆత్మీయుడు. అద్భుతమైన పాటలే కాదు..రీరికార్డింగ్ కూడా అద్భుతంగా ఇచ్చారు. ఇక సమీర్ రెడ్డి, ప్రవీణ్ పూడి, రామాంజనేయులు సహా అందరికీ థాంక్స్" అన్నారు.
సాయిపల్లవి మాట్లాడుతూ - "డైరెక్టర్ వేణుగారు ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంసీఏ సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాతో పాటు ఆయన భవిష్యత్తులో చేయబోయే సినిమాలన్నీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. భూమికగారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. తనతో కలిసి సినిమాలు చేయాలని ఉంది. నాని హార్డ్ వర్కర్. ఒక్కొక్క సీన్ చేసేటప్పుడు దాన్నెలా ఇంప్రవైజ్ చేయాలని బాగా ఆలోచించి చేస్తారు. దేవిశ్రీ ప్రసాద్‌గారి సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్" అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ - "నేను రాజుగారితో కలిసి ఎప్పుడెప్పుడు పనిచేయాలా? అని వెయిట్ చేస్తే ఏకంగా ఈ ఏడాది ఆయన బ్యానర్లో రెండు సినిమాలు చేశాను. 'నేను లోకల్' పెద్ద హిట్ అయ్యింది. డిసెంబర్ 21న 'ఎంసీఏ' విడుదల కాబోతుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌తో కూడా పనిచేయాలని అనుకుంటుంటే ఈ ఏడాదిలోనే రెండు సినిమాలు చేసేశాను. 'ఎంసీఏ' వంటి సినిమాకు ఎనర్జీ అవసరం.
అలాంటి ఎనర్జీని దేవిశ్రీ యూనిట్‌కు అందించారు. సమీర్ రెడ్డిగారు అద్భుతమైన విజువల్స్ అందించారు. సాయిపల్లవి నాకు ఫేవరెట్ కో స్టార్ అయ్యింది. తనతో నటించిన సీన్స్‌ను చూసి ఫిదా కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు వేణు కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. తను ఎంతో హార్డ్ వర్క్ చేసి సినిమాను చక్కగా తెరకెక్కించారు. సపోర్ట్‌చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com