బొమ్మరిల్లు తర్వాత మళ్లీ అంతటి పేరు తీసుకువచ్చింది శతమానం భవతి - దిల్ రాజు..!
Tuesday, January 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
బొమ్మరిల్లు, పరుగు, బృందావనం, మిస్టర్ పర్ ఫెక్ట్, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు...ఇలా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రాలను అందించే ఉత్తమాభిరుచి గల నిర్మాత దిల్ రాజు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శతమానం భవతి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజై అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... మా శతమానం భవతి చిత్రానికి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన చిత్రానికి ఈరేంజ్ కలెక్షన్స్ ఈమధ్య కాలంలో చూడలేదు. 3 రోజుల్లోనే డిస్ట్రిబ్యూటర్స్ కి డబ్బులు వచ్చేసాయి. ఇలా జరగడం ఒక అద్భుతం. సినిమా బాగుంది అని మౌత్ టాక్ బాగా రావడంతో ఫ్యామిలీ ఆడియోన్స్ ఈ సినిమా చూడడానికి వస్తున్నారు. 4 వ రోజు నుంచే లాభాలు వస్తుండడంతో మా డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఉదయం 9 గంటలకే మార్నింగ్ షో స్టార్ట్ చేస్తున్నారు అంటే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
సంక్రాంతికి రావడం వలనే ఈ రేంజ్ సక్సస్ వచ్చిందా అంటే కాదు అని చెబుతాను. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది అందుకనే ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తుంది. డైరెక్టర్ సతీష్ మా బ్యానర్ లో నిర్మించిన రామయ్య వస్తావయ్యా, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసాడు. ఓరోజు ఓ కథ ఉంది వింటారా అని అడిగితే...చెప్పమన్నాను. పేరెంట్స్ దగ్గరకి పిల్లలు వెళ్లకపోతే వాళ్ల బాధ ఎలా ఉంటుందో చెప్పాడు. వినగానే ఇదేదో బాగానే ఉంది అని ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టోరీ పై వన్ ఇయర్ వర్క్ చేసాం. చాలా మందికి ఈ స్టోరీ చెప్పాం. నానికి చెబితే కొన్ని సలహాలు ఇచ్చాడు. ఎక్కువ మందికి చెప్పడం వలన వాళ్ల రియాక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది. టోటల్ గా మంచి స్ర్కిప్ట్ రెడీ చేసాం. ఫైనల్ గా మేము అనుకున్నట్టే మంచి విజయం సాధించడం ఆనందంగా ఉంది.
ఎంటర్ టైన్మెంట్ ఉన్నా అది కూడా కథలో భాగంగానే ఉంటుంది. శర్వానంద్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ లో మాట్లాడితే బాగుంటుంది కొత్తగా ఉంటుంది అనుకుని క్యారెక్టర్ డిజైన్ చేసాం. ఫస్ట్ శర్వానంద్ కి నేనే ఫోన్ చేసి లైన్ చెప్పాను. నేను చేస్తే బాగుంటుందా అన్నాడు. ఈ సినిమా బిగ్ హిట్ అవుతాది. డైరెక్టర్ ని పంపిస్తాను ఫుల్ స్టోరీ విను అని చెప్పాను. ఆతర్వాత కథ విని చాలా బాగుంది నేను చేస్తాను చెప్పాడు. మా నమ్మకం నిజమైనందుకు హ్యాపీగా ఉంది.
రెండు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేయడానికి కారణం మా సినిమా పై ఉన్న నమ్మకమే. సినిమా పూర్తైన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ ని సినిమా ఎలా ఉంది అని అడిగితే రెగ్యులర్ గానే ఉంది కదా అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే...పాయింట్ కొత్తగా ఉంది అని మరో అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు . మనం ఆడియోన్స్ కోసం భారతం తీయాల్సిన అవసరం లేదు. ఎమోషన్స్, సాంగ్స్, ఎంటర్ టైన్మెంట్ వీటితో పాటు మంచి పాయింట్ చెబితే ఖచ్చితంగా సినిమా చూస్తారు. ఈ సినిమా తీస్తున్నప్పుడు నాకు తెలియని వ్యక్తులు నా ఫోన్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేస్తే చాలు అనుకున్నాను. నేను అనుకున్నట్టే నెల్లూరు నుంచి పొలిటిషియన్ నా నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని అభినందించాడు.
15 రోజుల తర్వాత కలెక్షన్స్ పరంగా అసలు నెంబర్ బయటకు వస్తుంది. ఇది ఎన్నారైల కోసం తీసింది కాదు. మనం పేరెంట్స్ కి ఎంత టైమ్ ఇస్తున్నాం. మనకు అన్నింటికి టైమ్ ఉంటుంది కానీ...పేరెంట్స్ తో స్పెండ్ చేయడానికి మాత్రం టైమ్ ఉండదు. మా అన్నయ్య ఈ సినిమా చూసి
మాట్లాడితే ఎక్కడ కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయా అని మాట్లాడకుండా వెళ్లిపోయి ఆతర్వాత ఫోన్ చేసి సినిమా ఎంత బాగుందో చెప్పాడు. యూత్ కి ఈ సినిమా నచ్చుతుందో లేదో అనుకున్నాను కానీ...యూత్ కి కూడా నచ్చడంతో హ్యాపీ. యువచిత్ర మురారి గారు బొమ్మరిల్లు సినిమా చూసి ఫోన్ చేసి అభినందించారు. ఆతర్వాత మళ్లీ ఈ సినిమాకి ఫోన్ చేసి అభినందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి గ్రేట్ సంక్రాంతి.
మా సినిమా శతమానం భవతి చిత్రాన్నినైజాంలో 92 థియేటర్స్ లో రిలీజ్ చేసాం. టోటల్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 250 థియేటర్స్ లో రిలీజ్ చేసాం. ఇప్పుడు 300 ధియేటర్స్ లో ఆడుతుంది. ఈనెల 26కి 100 ధియేటర్స్ పెంచనున్నాం. ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ కి చేరుకుంది. 1 మిలియన్ చేరుకుంటుంది అంటున్నారు. ఈ సినిమాకి 1 మిలియన్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈనెల 27 లేక 28న హైదరాబాద్ లో శతమానం భవతి సినిమాకి సంబంధించి ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ నా లైఫ్ లో మరచిపోలేని ఈవెంట్ అవుతుంది.
నాని నేను లోకల్ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందే చిత్రం సెప్టెంబర్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాం. వచ్చే సంవత్సరం సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం అని తెలియచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments