దిల్ రాజు చేతిలో మరో సంక్రాంతి సినిమా.
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నట సింహం బాలయ్య నటించిన డిక్టేటర్ మూవీ నైజాం రైట్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...తాజాగా దిల్ రాజు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న మరో సినిమా ఎక్స్ ప్రెస్ రాజా నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.
శర్వానంద్ హీరోగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాక గాంథీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యు.వి. క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడం..ఈ సినిమాకి ఫస్ట్ నుంచి పాజిటివ్ టాక్ ఉండడంతో ఎక్స్ ప్రెస్ రాజా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అవుతున్న రెండు సినిమాలు డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు దక్కించుకోవడం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments