close
Choose your channels

నానితో దిల్ రాజు సినిమా..!

Saturday, October 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నేను లోక‌ల్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. క్రిస్మెస్ కానుక‌గా నేను లోక‌ల్ చిత్రం డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ త‌ర్వాత నానితో దిల్ రాజు మ‌రో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని ఓ మై ఫ్రెండ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.
వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా దిల్ రాజు ఎవ‌డో ఒక‌డు అనే చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు. సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగింది కానీ..కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఆత‌ర్వాత అదే క‌థ‌తో నాగార్జున‌తో సినిమా చేయాలి అనుకున్నారు దిల్ రాజు. కానీ...ఎందుక‌నో నాగ్ ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు. ఇప్పుడు వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. స‌మ్మ‌ర్ లో ఈ సినిమా ప్రారంభించాలి అనుకుంటున్నార‌ట‌. అయితే...ర‌వితేజ‌తో అనుకున్న క‌థ‌తోనే సినిమా చేయ‌నున్నారో..లేక వేరే క‌థ‌తో చేయ‌నున్నార‌నేది తెలియాల్సి ఉంది..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.