దిల్ రాజు.. ఏడు సినిమాలు?
Send us your feedback to audioarticles@vaarta.com
2017 దిల్ రాజుకి బాగా కలిసొచ్చిన సంవత్సరమనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆరంభంలో శతమానం భవతి` తో హిట్ ని అందుకున్నారు. తర్వాత వరుసగా 'నేను లోకల్', 'దువ్వాడ జగన్నాధం', 'ఫిదా', 'రాజా ది గ్రేట్', 'ఎం.సి.ఎ.'.. ఇలా సుమారు రెండు నెలలకి ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు. ఇలా ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలను నిర్మించిన ఘనత.. ఇటీవల కాలంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ దే. కేవలం ఎక్కువ సినిమాలు నిర్మించడమే కాదు.. అందులో విజయాల శాతం కూడా ఎక్కువగా ఉండడం విశేషం.
ఈ సినిమాలు కేవలం.. ఆయన బ్యానర్ కి మాత్రమే హిట్ ని ఇవ్వలేదు. ఎప్పటినుంచో హిట్ కోసం పరితపిస్తున్న శేఖర్ కమ్ముల, రవితేజలని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి. అందుకే ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది. ఇప్పుడు మరో కొత్త టార్గెట్ తో 2018లో అడుగు పెడుతున్నారు రాజు.
రాబోయే సంవత్సరంలో ఏడు సినిమాలతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్, నితిన్, రాజ్ తరుణ్ తో నాలుగు సినిమాలు సెట్ మీద ఉన్నాయి. సబ్జెక్ట్లు, డైరెక్టర్లు దొరికితే మిగిలిన మూడు సినిమాలు చేయడానికి దిల్ రాజు సంస్థ ఎదురుచూస్తోంది. అలాగే దిల్ రాజుతో సినిమాలు చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments