దిల్ రాజు.. ఏడు సినిమాలు?

  • IndiaGlitz, [Friday,December 01 2017]

2017 దిల్ రాజుకి బాగా కలిసొచ్చిన సంవత్సరమనే చెప్పాలి. ఈ సంవత్సరం ఆరంభంలో శతమానం భవతి' తో హిట్ ని అందుకున్నారు. తర్వాత వరుసగా 'నేను లోకల్', 'దువ్వాడ జగన్నాధం', 'ఫిదా', 'రాజా ది గ్రేట్', 'ఎం.సి.ఎ.'.. ఇలా సుమారు రెండు నెలలకి ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు దిల్ రాజు. ఇలా ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలను నిర్మించిన ఘనత.. ఇటీవ‌ల కాలంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ దే. కేవలం ఎక్కువ సినిమాలు నిర్మించడమే కాదు.. అందులో విజయాల శాతం కూడా ఎక్కువగా ఉండ‌డం విశేషం.

ఈ సినిమాలు కేవ‌లం.. ఆయన బ్యానర్ కి మాత్రమే హిట్ ని ఇవ్వలేదు. ఎప్పటినుంచో హిట్ కోసం పరితపిస్తున్న శేఖర్ కమ్ముల, రవితేజలని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చాయి. అందుకే ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది. ఇప్పుడు మరో కొత్త టార్గెట్ తో 2018లో అడుగు పెడుతున్నారు రాజు.

రాబోయే సంవత్సరంలో ఏడు సినిమాలతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్, నితిన్, రాజ్ తరుణ్ తో నాలుగు సినిమాలు సెట్ మీద ఉన్నాయి. సబ్జెక్ట్లు, డైరెక్టర్లు దొరికితే మిగిలిన మూడు సినిమాలు చేయడానికి దిల్ రాజు సంస్థ ఎదురుచూస్తోంది. అలాగే దిల్ రాజుతో సినిమాలు చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

More News

కీర్తి సురేష్‌.. అత‌నితో మ‌రోసారి

'మెర్సల్' (అదిరింది) సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు త‌మిళ క‌థానాయ‌కుడు విజయ్. ప్ర‌స్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని.. త‌న‌కి ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చిన ఎ.ఆర్.మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.

'హాథీ మేరే సాథీ' అంటున్న రానా

రానా దగ్గుబాటి.. ఏనుగులతో స్నేహం చేస్తున్నారు. 'హాథీ మేరే సాథీ' అనే సినిమాలో నటిస్తున్నారు. అదేంటి.. ఇది పాత హిందీ సినిమా క‌దా అనుకుంటున్నారా! నిజమే 1971లో రాజేష్ ఖన్నా, తనూజా హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమాకి ఇది రీమేక్.

వర్మ సినిమాలో కథానాయికగా మైరా సరీన్

నాగార్జున-రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. "కంపెనీ" పతాకంపై రాంగోపాల్ వర్మ-సుధీర్ చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని.. జనవరి నుంచి మొదలవ్వబోయే సెకండ్ షెడ్యూల్ కి సన్నద్ధమవుతోంది.

2018లో యువి క్రియేషన్స్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా?

2013లో 'మిర్చి' సినిమాతో ఫిలిం ప్రొడక్షన్లో అడుగు పెట్టింది యువి క్రియేషన్స్ సంస్థ‌. వంశీ, ప్రమోద్  ఈ బ్యానర్ పై నిర్మించిన.. తమ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు.

కీర్తి బాట‌లో అను ఇమ్మాన్యుయేల్‌

కళకి అవధులు గాని, భాషా భేదం గాని లేదని పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన, వస్తున్న నటీమణులు తెలియజేస్తున్నారు. తెలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో వారే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటే.. ప్రేక్షకులు వారిని తెలుగు అమ్మాయిలుగా ట్రీట్ చేస్తారని భావించి ఈ భామలు తమ తమ క్యారెక్ట‌ర్స్‌ కి డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.