ఎన్టీఆర్ న్యూమూవీకి వెరైటీ టైటిల్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో మూవీలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న నాన్నకు ప్రేమతో రిలీజ్ చేస్తున్నవిషయం తెలిసిందే. నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ మూవీని రేపు ప్రారంభించనున్నారు.
అయితే ఈ మూవీకి జనతా గ్యారేజ్ - అన్ని రిపేర్ చేయబడును అనే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారట. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ బైక్ రిపేర్స్ తో పాటు సమాజంలో ఉన్నచెడుకి కూడా రిపేర్ చేస్తాడేమో..? టైటిల్ ఇంట్రస్టింగ్ గా ఉంది. మరి.. డైరెక్టర్ కొరటాల శివ ఈ టైటిల్నే ఫిక్స్ చేస్తాడో..లేక...వేరే టైటిల్ పెడతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments