Calling Sahastra:'కాలింగ్ సహస్త్ర' లో డిఫరెంట్ సుధీర్‌ని చూస్తారు: 'కలయా నిజమా..' సాంగ్ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్
Send us your feedback to audioarticles@vaarta.com
అటు బుల్లి తెర ఇటు సిల్వర్ స్క్రీన్‌పై తనదైన గుర్తింపు సంపాదించుకున్న యాక్టర్ సుడిగాలి సుధీర్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలిశ్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి బుధవారం ‘కలయా నిజమా..’ అనే లిరికల్ సాంగ్‌ను మీడియా మిత్రులు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
కె.ఎస్.చిత్ర మాట్లాడుతూ (వీడియో ద్వారా) ‘‘కాలింగ్ సహస్త్ర’ ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడి సాంగ్ పాడాను. చాలా చక్కటి సాంగ్. చాలా రోజుల తర్వాత మంచి మెలోడీ సాంగ్ పాడినట్లు అనిపించింది. సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ ‘‘మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. తనతో రెండో సినిమాకు కలిసి పనిచేస్తున్నారు. డైరెక్టర్ అరుణ్‌గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ రెహమానిక్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో ‘కలయా నిజమా..’ అనే మెలోడీ సాంగ్ పాడిన చిత్ర మేడమ్‌కి థాంక్స్. ఈ పాట పాడే సమయంలో ఆవిడకు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ నాలుగు గంటలు ప్రాక్టీస్ చేసి మరీ పాడారు. సపోర్ట్ చేసిన డైరెక్టర్, నిర్మాతలు, టీమ్‌కు ధన్యవాదాలు. అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సన్నీ. డి మాట్లాడుతూ ‘‘‘కాలింగ్ సహస్త్ర’ సినిమాలో ఈరోజు రిలీజ్ చేసిన ‘కలయా నిజమా’ సాంగ్ హిట్ అవుతుందని ముందే అనుకున్నాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుధీర్‌గారికి, నిర్మాతలకు, డైరెక్టర్‌గారికి థాంక్స్’’ అన్నారు.
యూ ట్యూబర్ రవితేజ మాట్లాడుతూ ‘‘‘కలయా నిజమా’ సాంగ్ చాలా చాలా బావుంది. సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. నన్ను బాగా సపోర్ట్ చేసిన సుధీర్ బ్రదర్‌కి, దర్శక నిర్మాతలకు థాంక్స్. టీమ్‌ను, మూవీని ఎంకరేజ్ చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను’’ అన్నారు.
నిర్మాత వెంకటేశ్వర్లు కటూరి మాట్లాడుతూ ‘‘నిర్మాతలుగా ‘కాలింగ్ సహస్త్ర’ మా తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ. డైరెక్టర్ అరుణ్‌గారు, హీరో సుధీర్‌గారు, హీరోయిణ్ డాలిశ్య సహా టీమ్ అందరూ ఎంతో కష్టపడ్డారు. కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు కష్టపడి షూటింగ్‌ను పూర్తి చేశాం. మంచి టీమ్‌తో పని చేశాం. మోహిత్గారు అద్భుతమైన ట్యూన్ ఇవ్వగా, లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు’’ అన్నారు.
నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ ‘‘కథ వినగానే నవల చదినప్పుడు ఎంత క్యూరియస్‌గా ఉంటుందో అలా అనిపించింది. చాలా ట్విస్టులు, టర్నులుంటాయి. టైటిల్ వినగానే ఇందేందని అనుకున్నాను. కానీ ఫస్ట్ సీన్ నుంచి ఎంగేజింగ్ చేస్తుంది. దర్శకుడు అరుణ్ డీటెయిలింగ్‌గా తెరకెక్కించారు. చాలా మంచి టీమ్ కుదిరింది. నిర్మాతలకు అభినందనలు. డాలిశ్య మంచి ఇన్టెన్స్ యాక్టర్. తనకు గుడ్ లక్ చెబుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. పర్టికులర్‌గా కలయా నిజమా సాంగ్ మెప్పిస్తుంది. సుధీర్ గురించి చెప్పాలంటే.. చాలా ఏళ్లుగా తెలుసు. తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాం. చాలా మంచి వ్యక్తి. కష్టపడి పైకొచ్చాడు. మంచి నటుడు. ఈ మూవీతో నటుడుగా తనలో కొత్త షేడ్‌ను చూపిస్తుంది. తమిళంలో శివ కార్తికేయలాగా తెలుగులో సుధీర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ ‘‘ కలయా నిజమా పాటకు మోహిత్ ట్యూన్ వినగానే నచ్చింది. చిత్రగారు పాడిన తర్వాత ఆ పాటకు మరింత అందం వచ్చింది. లక్ష్మీ ప్రియాంక చాలా మంచి లిరిక్స్ అందించారు. డాలిశ్య చాలా మంచి పాత్ర చేసింది. సుధీర్‌గారు కంప్లీట్ డిఫరెంట్‌గా కనిపిస్తారు. సినిమాటోగ్రాఫర్ సన్నీగారు బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. శివ బాలాజీగారికి థాంక్స్. మంచి టీమ్ కుదరడంతో మా పని ఎంతో సులభమైంది’. నిర్మాతల సపోర్ట్‌తో సినిమాను చక్కగా పూర్తి చేయగలిగాం’’ అన్నారు.
హీరోయిన్ డాలిశ్య మాట్లాడుతూ ‘‘సినిమాకు ‘కాలింగ్ సహస్త్ర’ అని ఎందుకు టైటిల్ పెట్టామనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మంచి సంగీతాన్ని, సాంగ్‌ను ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్గారికి, దాన్ని ఇంకా అందంగా పాడిన చిత్రగారికి, మంచి లిరిక్స్ అందించిన లక్ష్మీ ప్రియాంకగారికి థాంక్స్. నిర్మాతలకు కృతజ్ఞతలు. డైరెక్టర్ అరుణ్‌గారికి, సినిమాటోగ్రాఫర్ సన్నీగారికి థాంక్స్. శివ బాలాజీగారు ఎంతో సపోర్ట్ చేశారు. సుధీర్‌గారు మంచి కో యాక్టర్. సాంగ్ అందరికీ నచ్చి ఉంటుందని అనిపిస్తుంది’’ అన్నారు.
హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మోహిత్, లక్ష్మీ ప్రియాంకగారికి థాంక్స్. చిత్రమ్మగారి ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. సన్నీ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. మా నిర్మాతలు విజేష్, వెంకట్, చిరంజీవిగారికి థాంక్స్. మూడేళ్ల కష్టంఈ సినిమా. చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కి చేరుకున్నాం. మా డైరెక్టర్ అరుణ్‌గారు కథ చెప్పే సమయంలో బ్లూటూత్ స్పీకర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ కథను చెబుతూ వచ్చారు. అంత రేంజ్లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్టెన్స్తో సినిమా చేశారు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జోనర్లో చేసిన సినిమా ఇది. నాపై నమ్మకంతో సినిమా చేసిన డైరెక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు. శివ బాలాజీగారు అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ డాలిశ్యగారు వండర్ఫుల్ నటి. టీమ్ అందరం ఫ్యామిలీలా కలిసిపోయి యాక్ట్ చేశాం. సినిమా ఫైనల్ స్టేజ్‌లో గ్యారీ గారు సపోర్ట్ చేయటానికి వచ్చారు. ఆయనకు స్పెషల్ థాంక్స్. మార్క్ కె.రాబిన్గారికి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా ఇచ్చారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి మెంబర్‌కి థాంక్స్’’ అన్నారు.
నటీనటులు: సుడిగాలి సుధీర్, డాలిశ్య, స్పందనాపల్లి, శివ బాలాజీ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout