‘ఆదిపురుష్’ కోసం ఎలాంటి సెట్‌ వేస్తున్నారో తెలుసా?

  • IndiaGlitz, [Wednesday,March 31 2021]

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్పీడు పెంచేశాడు. ఎంత స్పీడంటే ఇతర టాలీవుడ్‌ హీరోలే కాదు, బాలీవుడ్ స్టార్స్‌ కూడా షాక్‌ అయ్యేంత స్పీడుగా ప్రభాస్‌ వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే దాదాపు ‘రాధేశ్యామ్’ షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్, ఇప్పుడు ఒక వైపు ‘సలార్’.. మరోవైపు ‘ఆదిపురుష్’ సినిమాలను ప్లానింగ్ ప్రకారం పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇందులో ‘ఆదిపురుష్’ విషయానికి వస్తే ఏప్రిల్ రెండో వారంలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీని కోసం దర్శక నిర్మాతలు ఓ ప్రైవేట్ స్టూడియోలో ఫారెస్ట్ సెట్‌ను వేశారట. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కీలకంగా మారనుంది. ఇంటర్నేషనల్ సినిమాల్లో ఉపయోగించే కటింగ్ ఎడ్జ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఓం రావుత్ ఉపయోగించనున్నాడట.

రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది చివరికి ఆదిపురుష్, సలార్ చిత్రాలను పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లానింగ్. తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ డేట్స్ కేటాయిస్తాడు.