ఎన్‌బీకే 107... వైవిధ్య‌మైన పాత్ర‌లో బాల‌య్య‌

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో త‌న 106వ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాక మునుపే ఆయ‌న త‌న 107వ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వివ‌రాల మేర‌కు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. కాగా.. ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని టాక్‌. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా ఈ సినిమా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట‌. బాల‌య్య, బోయ‌పాటి సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్స్ చేస్తున్నార‌ట‌. బాలకృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జూన్ 10న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుందని స‌మాచారం. ఈ సినిమాలో బాల‌య్య ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ని ఆయ‌న పాత్ర చాలా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం బాల‌కృష్ణ చేస్తోన్న 106వ చిత్రంలో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌ట‌. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర అని టాక్‌. విల‌న్‌గా న‌టి భూమిక చావ్లా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుత‌న్నాయి. ఇప్ప‌టికే రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ పూర్త‌య్యింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌గానే సినిమా త‌దుప‌రి షెడ్యూల్స్ షూటింగ్స్ స్టార్ట్ అవుతాయి. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

More News

పోర్న్ స్టార్‌తో వ‌ర్మ సినిమా...

క‌రోనా దెబ్బ‌కు సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. సినిమా థియేట‌ర్స్ మూతప‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఇలాంటి త‌రుణంలో

మీరు చేసిన‌దాంతో పోల్చితే నేను చేసిందేమీ లేదు: శేఖ‌ర్ క‌మ్ముల‌

సెన్సిబుల్ సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. ఆయ‌న తెర‌కెక్కించిన ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, లైప్ ఈజ్ బ్యూటీఫుల్ ఇలాంటి సినిమాలే ఆయ‌న స్టైల్ ఏంటో చెబుతాయి.

‘ఆత్మ నిర్భర్ భారత్’ అనే ఎందుకు.. ప్యాకేజీ ఉద్దేశమేంటి..!?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై పూర్తి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా మీట్ నిర్వహించి నిశితంగా వివరాలు వెల్లడించారు.

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో ఈ 14 పాయింట్లే కీలకం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నాడు జాతినుద్ధేశించి మాట్లాడుతూ.. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే.

EPF అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

కరోనా కష్టకాలంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం తియ్యటి శుభవార్త చెప్పింది. మంగళవారం నాడు జాతినుద్ధేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ