బరిలో డిఫరెంట్ చిత్రాల దర్శకులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇష్క్, మనం, 24 చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ప్రస్తుతం ఆయన అక్కినేని అఖిల్‌తో హలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా.. డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.
సినిమాపై ఆసక్తి పెంచింది. కాగా, హలో విడుదలైన తరువాత రోజు అంటే డిసెంబర్ 23న మరో ఆసక్తికరమైన సినిమా విడుదల కానుంది. అదే ఒక్క క్షణం. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.ఐ.ఆనంద్ దర్శకుడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి డిఫరెంట్ సబ్జెక్ట్‌తో అలరించిన ఈ దర్శకుడు.. తాజా చిత్రాన్ని కూడా అంతే డిఫరెంట్‌గా తెరకెక్కిస్తున్నాడని టైటిల్ లోగో చూస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ ఇద్దరు దర్శకులు మరోసారి ఆకట్టుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై కూడా పాజిటివ్ బజ్ ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com