కేసీఆర్-కట్టప్ప మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందేం!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- ఆయన కుటుంబానికి, పార్టీకి కట్టప్పలా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుకు మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందా..? రెండ్రోజుల కోసారి ఈ పంచాయితీ ఏంటి..? మొన్నే కలిశారు.. ఇవాళ మళ్లీ దూరమయ్యారెందుకు..? తెలంగాణలో అసలేం జరుగుతోంది.!
చింతమడక సరే.. గజ్వేల్‌కు వెళ్లలేదేం!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్ది రోజుల క్రితం హరీశ్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలోని చింతమడకు వెళ్లిన విషయం విదితమే. అక్కడ మొత్తం హరీశ్ రావు చేతుల మీదుగానే జరిగింది.. ఏర్పాట్లు మొదలుకుని అన్నీ కట్టప్పే చూసుకున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా చింతమడక మీద కేసీఆర్ వరాలు కురిపించారు. అయితే ఇవాళ తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు వెళ్లినప్పుడు కేసీఆర్ వెంట హరీశ్ రావు వెళ్లకపోవడంతో మళ్లీ మామా అల్లుళ్ల మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది..? అని అందరూ చర్చించుకుంటున్నారు.
అసలేం జరిగింది!
బుధవారం నాడు గజ్వేల్ మండలం కోమటిబండలో నిర్మించిన భగీరథ సంప్‌హౌస్‌ను సీఎం కేసీఆర్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలసి సందర్శించారు. సంప్‌హౌజ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ నాలెడ్జ్ సెంటర్‌ను ఈ సందర్భంగా కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. దీని ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 456 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. కోటి 40 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ భారీ సంప్‌హౌస్ నుంచి నిత్యం నీటి సరఫరా జరుగుతుంటుంది.
ఇంత భారీ ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి హరీశ్ రావు దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ సంప్ హౌజ్ నిర్మాణం జరిగింది కూడా హరీశ్ మంత్రిగా ఉన్నప్పుడే జరగడం.. కనీసం ఓపెనింగ్‌కు హరీశ్ రాకపోవడంతో పలురకాలు అందరూ చర్చించుకుంటున్నారు. అధికార పార్టీలో రెండ్రోజులకోసారి అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments