బాలయ్యతో వర్కవుట్ కాలేదు.. మరి సుధీర్ బాబుకి?
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన నిర్మాణ సంస్థల్లో శ్రీదేవి మూవీస్ ఒకటి. ఆదిత్య 369, వంశానికొక్కడు వంటి విజయంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్.. రెండేళ్ళ క్రితం విడుదలైన జెంటిల్ మన్ (నాని ద్విపాత్రాభినయం చేసిన చిత్రం)తో చాన్నాళ్ళ తరువాత మరో సక్సెస్‌ను చవిచూశారు.
ప్రస్తుతం జెంటిల్ మన్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతోనే సమ్మోహనం చిత్రం చేస్తున్నారు. సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ జంటగా నటిస్తున్న ఈ చిత్రం.. తాజాగా షూటింగ్‌ను కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం ఇదే తేదిన బాలకృష్ణ హీరోగా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన భలేవాడివి బాసూ కూడా విడుదలైంది. మరి బాలయ్య విషయంలో కలిసిరాని ఈ తేది.. సుధీర్ బాబుకైనా కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com