ఫోటోలోని వ్యక్తిని గుర్తించారా? షాక్ అవుతున్న నెటిజన్లు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫోటోలోని వ్యక్తిని చూశారా? గుర్తు పట్టారా? ఆ ఎవరో ఒక రైతులే అనుకుంటున్నారా? లేదు..ఎప్పుడూ చూడలేదంటూ స్కిప్ చేస్తున్నారా? కానీ మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. నిన్న మొన్నటి వరకూ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అంతకు మించి తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పిన రాజకీయ నాయకుడు. మొన్నీమధ్య వరకూ ఓ జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వుండి.. అంతకు ముందు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసి.. చివరికి ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టనంతగా తనకు తాను మారిపోయారు. ఇప్పటికైనా గుర్తొచ్చారా?
ఆయన ఎవరో కాదు.. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి. షాకింగ్‌గా అనిపిస్తోంది కదూ. నిజంగా ఆయనేనా అని తరచి తరచి చూడాల్సి వస్తోంది నెటిజన్లకు. ఇప్పుడు డిఫరెంటు లుక్కుతో కనిపిస్తున్నారు. ఏపీలో ఆఖరివిడత పంచాయతీఎన్నికల్లో ఓటేసేందుకు ఓ పాత మోపెడ్‌పై తన సతీమణి సునీతతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి వార్తల్లో నిలిచారు రఘువీరా.. నెరిసిన గెడ్డం.. రాయలసీమ రైతు ఆహార్యం.. ఈయన ఆయనేనా అన్నట్టుగా మారిపోయారు రఘువీరారెడ్డి.
రఘువీరా ట్వీట్ చేశారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఆయనను ఈ గెటప్‌లో గుర్తించడమనేది దాదాపు సాధ్యం కాదు. తన భార్యతో కలిసి నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశానని వెల్లడిస్తూ పాత మోపెడ్‌పై తన భార్యను ఎక్కించుకుని వెళుతున్న పిక్‌ను రఘువీరా షేర్ చేశారు. ‘‘నేను నా భార్య సునీతా రఘువీర్ కలిసి నాలుగవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గంగులవానిపాలెం పంచాయతీలో ఓటు హక్కును వినియోగించుకున్నాం’’ అని రఘువీరా ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన షేర్ చేసిన పిక్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments