Vote: ఓటు వేయకపోతే జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారు తెలుసా..?

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది తప్పనిసరి కాదు. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఓటు వేసుకోవచ్చు లేదంటే వేయకుండా ఉండవచ్చు. ఓటు వేయని వారికి ఎలాంటి శిక్ష ఉండదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా బాధ్యతగా పరిగణిస్తూ ఓటు వేయాలి. కానీ పలు దేశాల్లో ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని తెలుసా.. అవును మీరు విన్నది నిజమే. దాదాపు 22 దేశాలు ఓటు వేయడాన్ని తప్పనిసరి చేశాయి. లేదంటే జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తారు. ప్రభుత్వాలు ఎన్నుకోవడంలో ప్రజలకు బాధ్యత ఉండేలా ఈ చట్టాలు తీసుకువచ్చారు.

ఈ దేశాల్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. బ్రెజిల్, టర్కీ, ఈజిప్ట్, లక్సెంబర్గ్, బెల్జియం, ఇటలీ, గ్రీస్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉన్నాయి. వీటిలో చాలా దేశాలు లాటిన్ అమెరికాలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఓటు వేయకపోతే అక్కడి ప్రభుత్వం వారికి 20 డాలర్ల జరిమానా విధిస్తారు. దానిని గడువులోగా చెల్లించకపోతే మరో 200 డాలర్లు జరిమానా విధిస్తారు. అందుచేత కంగారు దేశంలో 1960 నుంచి 92శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదుకాలేదు. ఇక బెల్జియం దేశం 1893 నుంచి తప్పనిసరి ఓటింగ్ చట్టాన్ని కలిగి ఉంది. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోని వారికి 80 యూరోలు.. రెండో సారి ఓటు వేయకపోతే 200 యూరోలు జరిమానా ఉంటుంది. అలాగే వరుసగా నాలుగు సార్లు ఓటు వినియోగించుకోకపోతే పదేళ్ల వరకు ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తారు.

ఇక బ్రెజిల్లో కూడా ఓటు వేయని వారు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. గ్రీస్, ఈజిప్టు దేశాల్లో ఓటు వేయని వారిపై విచారణ చేపడతారు. సరైన కారణంతో ఓటు వేయలేదని తేలితే వదిలేస్తారు. లేదంటే జైలు శిక్ష విధిస్తారు. ఇటలీలో ఓటు వేయని వారి పేర్లు అధికారిక పత్రాల్లో బహిరంగంగా ప్రదర్శిస్తారు. పెరూలో అయితే ఓటు వేయని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. టర్కీలో నిర్బంధ ఓటింగ్ 1986లో ప్రవేశపెట్టారు. పౌరులు ఓటు వేయడానికి వెళ్లకపోతే 8 యూరోల జరిమానా చెల్లించాలి. ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఓటింగ్ శాతం 86%కి పెరిగింది. లక్సెంబర్గ్‌లోనూ నిర్బంధ ఓటింగ్ చట్టం ఉంది.

ఇలా ఒక్కో దేశంలో ఒక్కో విధమైన జరిమానాలు, శిక్షలు ఉన్నాయి. కానీ మన దేశంలోనే ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. దీనిని సామాజిక బాధ్యతగా తీసుకుని ఓటు వేయాలి కానీ బాధ్యతారహితంగా ఉండటం ఏమాత్రం సమంజశం కాదు. ఇప్పటికే 2015లో కర్ణాటక ప్రభుత్వం ఓటు తప్పనిసరి చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నాలు చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే ఓటు వేయడాన్ని బద్ధకంగా భావించి ఇంట్లోనే కూర్చుంటే మన దేశంలో కూడా ఓటు హక్కు తప్పనిసరి చేసే చట్టం వచ్చే అవకాశం లేకపోలేదు.

More News

Voter Slip: ఓటర్ స్లిప్ లేదా..? ఏం పర్లేదు.. ఇలా చేసి ఓటు వేయండి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పల్లె నుంచి నగరాల వరకు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు.

Vijaykanth: కెప్టెన్ కోలుకుంటున్నారు, ఆందోళన వద్దు : భార్య ప్రేమలత సందేశం

తమిళ అగ్రనటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు ఆయన సతీమణి ప్రేమలత క్లారిటీ ఇచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు రాజకీయ నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్

తెలంగాణలో ఓట్ల జాతర మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సామాన్యులతో పాటు సినీ

Rules Ranjan:ప్రముఖ ఓటీటీలో 'రూల్స్ రంజన్'.. ఎప్పుడంటే..?

యువ హీరో కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణివారు' సినిమాతో అరంగేట్రం చేశాడు. పక్కింటి కుర్రాడిలా నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు.