వాట్సాప్‌లో ఇది చూశారా?
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త ప్రైవసీ పాలసీపై ప్రఖ్యాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. మూడు నెలల పాటు దీనిని వాయిదా వేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. తమ నూతన ప్రైవసీ పాలసీని ఫిబ్రవరి 8 లోపు అంగీకరించాలని లేదంటే యూజర్ల ఖాతాను తొలగిస్తామని వాట్సాప్ హెచ్చరించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు.. చాలా మంది వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాను తొలగించి ఇతర మెసేజింగ్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభించాయి. ప్రస్తుతానికి వాట్సాప్ వివరణ ఇచ్చుకున్నా వినియోగదారులైతే వినే పరిస్థితి లేదు. దీంతో వాట్సాప్ సంస్థ తమ ప్రైవసీ పాలసీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. మరో మూడు నెలల పాటు గడువు తీసుకుని ఈ లోగా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు యత్నిస్తామని వెల్లడించింది.
చెప్పిన ప్రకారమే వాట్సాప్ తమ వినియోగదారుల నమ్మకాన్ని రాబట్టుకునేందుకు యత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం నుంచి వాట్సాప్ వినియోగదారులు తమ స్టేటస్ ఐకాన్ క్లిక్ చేయగానే తమ స్నేహితుల స్టేటస్‌తో పాటు వాట్సాప్ సంస్థ పెట్టిన స్టేటస్ కూడా మనకు ప్రముఖంగా కనిపిస్తోంది. వాట్సాప్ తన స్టేటస్ ద్వారా తమ ఖాతాదారులకు పలు విషయాలను స్పష్టం చేస్తోంది. తద్వారా ఖాతాదారుల నమ్మకాన్ని రాబట్టుకునేందుకు యత్నిస్తోంది. అలాగే తమ ఖాతాదారులు చేజారిపోకుండా వాట్సాప్ సంస్థ చూసుకునేందుకు యత్నిస్తోంది. వాట్సాప్ తన నూతన ప్రైవసీ పాలసీని ప్రకటించిన తక్షణమే వినియోగదారులు వేరే యాప్‌లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.
తమ ఖాతాదారులు వేరే మెసేజింగ్ యాప్‌ల వైపు చూడకుండా వాట్సాప్ చర్యలు చేపడుతోంది. దీనికోసం తన వాట్సాప్ స్టేటస్ ద్వారా ముఖ్యంగా నాలుగు విషయాలను ఖాతాదారులకు స్పష్టం చేసేందుకు యత్నిస్తోంది. మొదటి విషయం ‘మీ ప్రైవసీకి భంగం కలిగించం’.. రెండో విషయం.. ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయినందువల్ల మేము మీ వ్యక్తిగత సంభాషణలను మేము వినలేము.. చదవలేము..’.. మూడో విషయం.. ‘మీరు షేర్ చేసిన లొకేషన్‌ను వాట్సాప్ చూడదు’.. ఇక చివరిది.. నాలుగో విషయం.. ‘మీ కాంటాక్ట్స్‌ని వాట్సాప్ ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోదు’ అని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ నాలుగు విషయాలను స్పష్టం చేయడం ద్వారా వాట్సాప్ సంస్థ తమ ఖాతాదారుల నమ్మకాన్ని తిరిగి సంపాదించగలుగుతుందో లేదో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout