మ‌హేష్ కి టైటిల్ న‌చ్చ‌లేదా..!

  • IndiaGlitz, [Monday,December 12 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎనీమి, అభిమ‌న్యు, ఏజెంట్ శివ‌, ఏజెంట్ 007...ఇలా ర‌క‌ర‌కాల టైటిల్స్ ప‌రిశీలించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఫిల్మ్ ఛాంబ‌ర్ లో చిత్ర నిర్మాత‌లు ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంభ‌వామి అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేసారు. దీంతో ఈ మూవీకి సంభ‌వామి అనే టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ఈ టైటిల్ కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే...సంభవామి టైటిల్ మ‌హేష్, మురుగుదాస్ ఇద్ద‌రికీ న‌చ్చ‌లేద‌ట‌. టైటిల్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాలి అనుకుంటున్నార‌ట‌. మురుగుదాస్ త‌న టీమ్ కి ప‌వ‌ర్ ఫుల్ గా ఉండే మ‌రో టైటిల్ ఆలోచించ‌మ‌ని చెప్పాడ‌ట‌. మురుగుదాస్ తెర‌కెక్కించిన చిత్రాలకు క‌త్తి, తుపాకి అంటూ ఆయుధాల పేరు టైటిల్స్ గా పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి కూడా ఆయుధం పేరే టైటిల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి...ఫైన‌ల్ గా ఏ టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేస్తారో చూడాలి..!