అందుకు నయనతార ఒప్పుకోలేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు, ఫెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సినిమాలకే పరిమితమైన మలయాళ సుందరి నయనతార లెటెస్ట్ మూవీ మయూరి`(తమిళంలో మాయ`). సినిమా రిలీజ్ కి ముందు నయనతార డబుల్ రోల్ చేసిందని, తొలిసారి హర్రర్ మూవీలో నటించిందని నిర్మాతలు ఊదరగొట్టేశారు. అయితే సినిమాకి వచ్చిన ప్రేక్షకుడుకి మాత్రం ఒక విషయం మాత్రం అర్థం కాలేదు.
ఇందులో ఎక్కడా నయనతార ఎక్కడా డబుల్ రోల్ లో కనపడదు. మాయ, మయూరి అనే పేర్లలో మాయ అనే క్యారెక్టర్ డీ గ్లామర్ రోల్, మానసిక వికలాంగురాలి పాత్ర. ఈ రోల్ లో కనీసం ఒక్కసారి కూడా నయనతార ఫేస్ కనపడదు. అందెందుకనే విషయం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇటువంటి డీ గ్లామర్ రోల్ లో కనపడటానికి నయన ఒప్పుకోకపోవడంతోనే దర్శక, నిర్మాతలు ఆమె ఫేస్ ను చూపించకుండా మెనేజ్ చేసినట్టు కనపడుతుంది. మరోపాత్ర మయూరిలో నయనతార చేసిన పెర్ పార్మెన్స్ బాగున్నా, ఆమె సీనియారిటికీ గొప్ప అదేం గొప్ప రోల్ కాదు. విలక్షణంగానే ఏం చేయలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com