కాజల్‌కు ఎంగేజ్మెంట్ జరిగిందా..?
Send us your feedback to audioarticles@vaarta.com
దశాబ్దం కాలం ముందు తెలుగు ప్రేక్షకులను హీరోయిన్గా పలకరించింది కాజల్ అగర్వాల్. చందమామలాంటి అమ్మడు నచ్చడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత తమిళంలో స్టార్స్‌తో కలిసి నటించింది. అలాగే బాలీవుడ్‌లోనూ రెండు మూడు సినిమాల్లో నటించింది. ఇన్నేళ్లయినా కాజల్ అగర్వాల్ కుర్ర హీరోయిన్స్‌కు పోటీనిస్తూ భారీ చిత్రా్ల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. రీసెంట్గా కాజల్ అగర్వాల్ నిశ్చితార్థం గౌతమ్ అనే బిజినెస్‌మేన్‌తో జరగనుందట. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు కానీ.. కాజల్ నిశ్చితార్థానికి కొందరు టాలీవుడ్ ప్రముఖ హీరోలు హాజరైనట్లు మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు కాజల్ సన్నిహిత వర్గాలు మాత్రం కాజల్ నిశ్చితార్థం వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. సినిమాల విషయానికి వస్తే కాజల్ ప్రస్తుతం చిరంజీవి 152వ చిత్రం ఆచార్యతో పాటు ఇండియన్ 2లో నటిస్తుంది. మోసగాళ్లు, క్వీన్ సౌత్ రీమేక్, హాలీవుడ్ వెబ్ సిరీస్ సహా పలు ప్రాజెక్టులతో సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments